ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

ABN, Publish Date - May 19 , 2025 | 01:23 AM

తిరుమలలో ఆదివారమూ భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవుల నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో రద్దీ పెరిగిన విషయం తెలిసిందే. యాత్రికుల క్యూలైన్లు వెలుపలకు రాకపోయినా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో మూడురోజులుగా నిండుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలోనూ ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సహా వేసవి సెలవులు కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

నారాయణగిరి గార్డెన్‌లోని క్యూలో భక్తులు

తిరుమలలో ఆదివారమూ భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవుల నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో రద్దీ పెరిగిన విషయం తెలిసిందే. యాత్రికుల క్యూలైన్లు వెలుపలకు రాకపోయినా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో మూడురోజులుగా నిండుతున్నాయి. ఆదివారం కూడా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో షెడ్లు నిండి.. క్యూలైన్‌ కృష్ణతేజ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వీరికి 16 గంటల దర్శన సమయం పడుతోంది, టైంస్లాట్‌ భక్తులకూ దాదాపు మూడు గంటల దర్శన సమయం పడుతోంది. శ్రీవారి ఆలయ ప్రాంతం, అఖిలాండం, లడ్డూకౌంటర్‌, అన్నప్రసాద భవనం, బస్టాండ్‌, లేపాక్షి, రాంభగీచ సర్కిల్‌, వరాహస్వామి విశ్రాంతి భవనాల వద్ద భక్తుల సందడి ఎక్కువగా ఉంది. గదుల కోసం సీఆర్వో, ఎంబీసీ, పద్మావతి విచారణ కార్యాలయాల ముందు భక్తులు బారులు తీరారు. గదులు దొరకని వారు ఆయా కార్యాలయాల ముందు, క్యూలైన్ల వద్ద, వసతి సముదాయాలు, షెడ్లలోనే సేదతీరారు. కేటాయించిన సమయానికంటే ముందుగానే రావడంతో స్లాటెడ్‌ సర్వదర్శన భక్తులతో ఎంబీసీ, ఎస్వీ గెస్ట్‌హౌస్‌ ఏరియాలోనూ రద్దీ ఉంటోంది.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

ముక్కంటి ఆలయంలోనూ..

శ్రీకాళహస్తీశ్వరాలయంలోనూ ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సహా వేసవి సెలవులు కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సుమారు 30 వేలమంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 536 మంది, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 2,341, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 3,508 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 3,049మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,177, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 336, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 318, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 72మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఐదు రకాల ప్రసాదాలు కలిపి 21,210 విక్రయించినట్టు అధికారులు తెలిపారు.

- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి

Updated Date - May 19 , 2025 | 01:23 AM