డీసీసీబీకి, విండోలకు త్వరలో కమిటీలు
ABN, Publish Date - May 31 , 2025 | 01:49 AM
జిల్లా సహకారకేంద్ర బ్యాంకుతో పాటు 75 సింగిల్ విండోలకు త్వరలో కమిటీలు ఏర్పడనున్నట్లు సమాచారం.డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జిగా అమాస రాజశేఖర రెడ్డి నియామకం గురువారం జరిగింది.ప్రభుత్వం గత ఏడాది డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జిగా జేసీ విద్యాధరిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు జూన్ నెల 26వ తేదీవరకు అమల్లో ఉంటాయి.
చిత్తూరు కలెక్టరేట్, మే 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకారకేంద్ర బ్యాంకుతో పాటు 75 సింగిల్ విండోలకు త్వరలో కమిటీలు ఏర్పడనున్నట్లు సమాచారం.డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జిగా అమాస రాజశేఖర రెడ్డి నియామకం గురువారం జరిగింది.ప్రభుత్వం గత ఏడాది డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జిగా జేసీ విద్యాధరిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు జూన్ నెల 26వ తేదీవరకు అమల్లో ఉంటాయి. అందువల్ల జేసీ స్థానంలో అమాస నియామకం వచ్చేనెల 27వ తేదీ నుంచి ఆరునెలల కాలానికి మరో జీవోను తర్వాత జారీచేస్తారు. సాధారణంగా డీసీసీబీ పాలకవర్గాన్ని అనధికార వ్యక్తులతో భర్తీ చేసేటప్పుడు ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌తో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమిస్తారు. వచ్చేనెల జారీచేయనున్న జీవోలో మాత్రం ఏడుగురితో పాలకమండలిని నియమించిన తర్వాత అమాస రాజశేఖర రెడ్డి పర్శన్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. గత ప్రభుత్వ హయాంలో చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన ఎం. రెడ్డెమ్మ తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే తన పదవికి రాజీనామా చేసి తప్పుకున్నారు. నాటి నుంచి గత ఆరునెలలుగా డీసీసీబీ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. నామినేటెడ్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు లేకపోవడంతో డిపాజిట్ దారులు, సహకార సంఘాల సభ్యులు తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం లేకపోయింది. గత పాలకవర్గం చేసిన ఆర్థిక తప్పిదాలపై సహకారచట్టం సెక్షన్-51 మేర విచారణ పూర్తయ్యింది. శనివారం విచారణ అధికారి అయిన డీఆర్వో మోహన్‌కుమార్ ఇందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు అందించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోకున్నా ఉద్యోగులపై కేసులు పెట్టే అవకాశముందన్న సమాచారంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పర్సన్ ఇన్‌చార్జిగా నియమితులైన అమాస రాజశేఖర రెడ్డి జూన్ మొదటి వారంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Updated Date - May 31 , 2025 | 01:49 AM