ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: యువనేత రాకేశ్ చౌదరి మృతి తీవ్రంగా కలచి వేసింది: సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Jan 19 , 2025 | 08:02 PM

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె (Kandulavaripalle) ఉపసర్పంచ్, టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి (Rakesh Chaudhary) మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఏనుగుల దాడి(Elephant Attack)లో రాకేశ్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

AP CM Chandrababu Naidu

అమరావతి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె (Kandulavaripalle) ఉపసర్పంచ్, టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి (Rakesh Chaudhary) మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏనుగుల దాడి (Elephant Attack)లో రాకేశ్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పంటపొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును తరిమే క్రమంలో ఆయన మృత్యు ఒడికి చేరడం అత్యంత దురదృష్టకరమని ముఖ్యమంత్రి అన్నారు. టీడీపీ కార్యక్రమాల్లో నిత్యం చురుగ్గా పాల్గొనే పసుపు సైనికుడు రాకేశ్ మృతి బాధాకరమని ఆవేదనకు లోనయ్యారు. పోరాటపటిమతో అనతికాలంలోనే గుర్తింపు పొందిన యువకెరటం మృతి పార్టీకి తీరని లోటని బాధపడ్డారు. రాకేశ్ ఆత్మకు శాంతి కలగాలని, అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు్న్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.

Andhra Pradesh: గోకరాజుపల్లిలో తానా ఆధ్వర్యంలో రైతు పరికరాల పంపిణీ


కాగా, చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉప సర్పంచ్ మార్పూరి రాకేశ్ చౌదరి ఆదివారం రాత్రి ఏనుగుల దాడిలో మృతిచెందారు. అర్ధరాత్రి సమయంలో నారావారిపల్లె సమీప పంట పొలాలపై ఏనుగుల గుంపు పడినట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో వాటిని తరిమేందుకు అధికారులు, స్థానికులతో కలిసి రాకేశ్ వెళ్లారు. వాటిని బెదిరించే క్రమంలో తిరిగపడిన ఏనుగులు వారిపై దాడికి యత్నించాయి. అయితే అందరూ తప్పించుకోగా.. ఓ ఏనుగు మాత్రం తన తొండంతో రాకేశ్‌ను పట్టుకుంది. అనంతరం బలంగా నేలకేసి కొట్టింది. ఏనుగు దాడిలో రాకేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి రాకేశ్ అత్యంత సన్నిహితుడు. మరోవైపు మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే పులవర్తి నాని సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి:

AP News: ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్..

Kidnap: కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితులు అరెస్ట్

Updated Date - Jan 19 , 2025 | 08:17 PM