ప్రశాంతంగా ‘నీట్’
ABN, Publish Date - May 05 , 2025 | 01:51 AM
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ-2025) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగ్గా.. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లా వ్యాప్తంగా 4,445 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,333 మంది పరీక్ష రాయగా, 112 మంది గైర్హాజరయ్యారు. తిరుపతిలోని పలు పరీక్ష కేంద్రాలను డీఆర్వో నరసింహులు తనిఖీ చేశారు. తిరుపతిలో 9, గూడూరులో ఒకటి చొప్పున 10 కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష జరిగింది.
తిరుతి(విద్య), మే 4(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ-2025) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగ్గా.. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లా వ్యాప్తంగా 4,445 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,333 మంది పరీక్ష రాయగా, 112 మంది గైర్హాజరయ్యారు. తిరుపతిలోని పలు పరీక్ష కేంద్రాలను డీఆర్వో నరసింహులు తనిఖీ చేశారు. తిరుపతిలో 9, గూడూరులో ఒకటి చొప్పున 10 కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరిసర ప్రాంతాల్లో జిరాక్స్.. ఇంటర్నెట్ సెంటర్లను మూయించారు. కేంద్రియ విద్యాలయం-1 ప్రిన్సిపల్ హేమంత్‌కుమార్ పాండ్య నీట్ సిటీ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.
విద్యార్థులతో కలిసొచ్చిన తల్లిదండ్రులు
విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులూ పెద్ద సంఖ్యలో పరీక్ష కేంద్రాల వద్దకు వచ్చారు. పరీక్ష బాగా రాయాలని ధైర్యం చెప్పారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులతో సెల్ఫీలు తీసుకుంటూ నీట్‌కు హాజరవుతున్న సందర్భాన్ని పదిలం చేసుకున్నారు.
చీకట్లో పరీక్షలు
ఆదివారం మధ్యాహ్నం తిరుపతిలో సుమారు రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలు బలంగా వీయడంతో నగరంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో తిరుపతిలోని పరీక్షా కేంద్రాల్లోనూ విద్యుత్తు సరఫరా ఆగింది. భారీ గాలులు, వర్షంతో కిటికీలు, తలుపులు వేశారు. అదే సమయంలో కరెంటు పోవడంతో గదుల్లో నెలకొన్న చీకటిలోనే విద్యార్థులు పరీక్ష రాయాల్సి రావడంతో అసౌకర్యానికి గురయ్యారు.
Updated Date - May 05 , 2025 | 01:51 AM