నేడు, రేపు బస్సుపాసుల జారీ నిలిపివేత
ABN, Publish Date - Jun 12 , 2025 | 01:09 AM
ఆర్టీసీ బస్సు పాసుల జారీ ప్రక్రియను గురు, శుక్రవారాల్లో తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీటీఎం విశ్వనాధం బుధవారం తెలిపారు.
తిరుపతి(ఆర్టీసీ), జూన్ 11(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు పాసుల జారీ ప్రక్రియను గురు, శుక్రవారాల్లో తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీటీఎం విశ్వనాధం బుధవారం తెలిపారు. 2025-26 విద్యా సంసత్సరం బస్సుపాసుకు సంబంధించి సాఫ్ట్‌వేర్ అనుసంధానం, నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో 14నుంచి కొత్త పాసుల జారీ యథావిధిగా కొనసాగనుంది.
Updated Date - Jun 12 , 2025 | 01:09 AM