ఆన్‌లైన్‌లోనే భవన నిర్మాణ అనుమతులు
ABN, Publish Date - Jul 25 , 2025 | 01:42 AM
చుడా పరిధిలోని భవన నిర్మాణ అనుమతులను మాన్యువల్‌గా కాకుండా ఆన్‌లైన్ ద్వారానే ఇవ్వాలని చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత అన్నారు.
చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత
చిత్తూరు అర్బన్, జూలై 24 (ఆంఽధ్రజ్యోతి): చుడా పరిధిలోని భవన నిర్మాణ అనుమతులను మాన్యువల్‌గా కాకుండా ఆన్‌లైన్ ద్వారానే ఇవ్వాలని చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత అన్నారు. చుడా కార్యాలయంలో భవన నిర్మాణం, లేఅవుట్ల అనుమతులపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనధికార లే అవుట్లు, నిర్మాణాలను ఎప్పటికప్పుడు గుర్తించి నోటీసులు ఇవ్వడంతోపాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. ఆన్‌లైన్ విధానంపై పంచాయతీ కార్యదర్శులు అప్‌డేట్ అవ్వాలన్నారు. సమావేశంలో చుడా ఉపాధ్యక్షులు విద్యాధరి, ప్రణాళిక అధికారి చంద్రమోహన్, కార్యదర్శులు తారకరామ, విక్రమ్, సాంబశివ పాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 01:42 AM