ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఆడుదాం ఆంధ్ర’ అవినీతిపై విజిలెన్స్‌

ABN, Publish Date - May 20 , 2025 | 02:06 AM

గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి ఆర్కే రోజా సారధ్యంలో జరిగిన ‘ఆడుదాం.. ఆంధ్ర’ క్రీడల కార్యక్రమాల్లో జరిగిన అవినీతి తీగ లాగుతున్నారు. తిరుపతి జిల్లాలో ముఖ్యంగా రోజా ప్రాతినిథ్యం వహించిన నగరి నియోజకవర్గంలో చోటుచేసుకున్న అవకతవకల చిట్టాను సేకరించే పనికి తిరుపతి ప్రాంతీయ విజిలెన్స్‌ అధికారులు సోమవారం శ్రీకారం చుట్టారు. 2023-24 సంవత్సరంలో హడావుడిగా ప్రారంభించిన ‘ఆడుదాం-ఆంధ్ర’ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు జగన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల్లో గోల్‌మాల్‌ జరిగిందంటూ అనేక ప్రాంతాల నుంచీ విజిలెన్సు డీజీ భరీ్‌షకుమార్‌ గుప్తాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. దీంతో విజిలెన్సు ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ నుంచి అవసరమైన రికార్డులు తెప్పించి పరిశీలించారు.

- రోజా ఇలాకాపై ప్రత్యేక దృష్టి

తిరుపతి(నేరవిభాగం) మే 19 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి ఆర్కే రోజా సారధ్యంలో జరిగిన ‘ఆడుదాం.. ఆంధ్ర’ క్రీడల కార్యక్రమాల్లో జరిగిన అవినీతి తీగ లాగుతున్నారు. తిరుపతి జిల్లాలో ముఖ్యంగా రోజా ప్రాతినిథ్యం వహించిన నగరి నియోజకవర్గంలో చోటుచేసుకున్న అవకతవకల చిట్టాను సేకరించే పనికి తిరుపతి ప్రాంతీయ విజిలెన్స్‌ అధికారులు సోమవారం శ్రీకారం చుట్టారు. 2023-24 సంవత్సరంలో హడావుడిగా ప్రారంభించిన ‘ఆడుదాం-ఆంధ్ర’ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు జగన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల్లో గోల్‌మాల్‌ జరిగిందంటూ అనేక ప్రాంతాల నుంచీ విజిలెన్సు డీజీ భరీ్‌షకుమార్‌ గుప్తాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. దీంతో విజిలెన్సు ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ నుంచి అవసరమైన రికార్డులు తెప్పించి పరిశీలించారు. జిల్లాలో ఆట స్థలాలే లేని చోట్ల కూడా ఆటలు జరిగినట్లుగా పేర్కొన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నగరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు రావడంతో విజిలెన్సు డీఎస్పీ మల్లికార్జున రావు, సీఐ చంద్రశేఖర నాయక్‌, సిబ్బంది విచారణ చేస్తున్నారు. మరో మూడ్రోజులపాటు ఇది కొనసాగనుంది. జిల్లాకు ‘ఆడుదాం-ఆంధ్ర’ కింద నిధులు ఎంత వచ్చాయి? ఎంత ఖర్చు చేశారు? ఆటలకు సంబంధించి ఎన్ని కిట్లు కొనుగోలు చేశారు? వీటిని ఎక్కడ నుంచి తెప్పించారు? వాటి నాణ్యత ఏమిటి.. వంటి వివరాలను ఆరా తీస్తున్నారు. దీంతో పాటు క్రీడాకారులకు భోజన సదుపాయాలు, తదితర విషయాల మీద కూడా వివరాలు సేకరిస్తున్నారు.

Updated Date - May 20 , 2025 | 02:06 AM