ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లాకు మరో 13వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు

ABN, Publish Date - Jun 13 , 2025 | 01:44 AM

జిల్లాకు మరో 13 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రానున్నాయి. తొలి దశలో జిల్లాకు 26,639 క్వింటాళ్ల విత్తనకాయలు కేటాయించారు. ఈనెల నాల్గవ తేదీన పంపిణీ ప్రారంభించగా, గురువారం నాటికి 53,747 మంది రైతులకు 21,639 క్వింటాళ్ల విత్తనాలు అందజేశారు.

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మరో 13 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రానున్నాయి. తొలి దశలో జిల్లాకు 26,639 క్వింటాళ్ల విత్తనకాయలు కేటాయించారు. ఈనెల నాల్గవ తేదీన పంపిణీ ప్రారంభించగా, గురువారం నాటికి 53,747 మంది రైతులకు 21,639 క్వింటాళ్ల విత్తనాలు అందజేశారు. తవణంపల్లె, వెదురుకుప్పం, తదితర మండలాల్లో విత్తనాల కోసం రెండ్రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో విత్తనాల కొరత అధికంగా ఉన్న క్రమంలో మరో 13వేల క్వింటాళ్లు అవసరం కానుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పరిశీలించిన ప్రభుత్వం అదనపు కోటాను పంపేందుకు ఆమోదం తెలిపింది. రెండో దఫా విత్తనాలు రాగానే కొరత ఉన్న మండలాల్లో పంపిణీ చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళీకృష్ణ తెలిపారు.

Updated Date - Jun 13 , 2025 | 01:44 AM