తండ్రిపై కోపంతో చిన్నారిని కొట్టిన అంగన్వాడీ టీచర్
ABN, Publish Date - Jun 17 , 2025 | 01:44 AM
తండ్రిపై కోపంతో చిన్నారిని కొట్టారో అంగన్వాడీ టీచర్. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. పాలసముద్రం మండలంలోని టీవీఎన్‌ఆర్‌పురం అంగన్వాడీ కేంద్రం సరిగా తెరవడం లేదని నిరసిస్తూ గత శుక్రవారం ఆ కేంద్రానికి సర్పంచ్ అమరావతి సమక్షంలో గ్రామస్తులు తాళం వేశారు.
పాలసముద్రం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): తండ్రిపై కోపంతో చిన్నారిని కొట్టారో అంగన్వాడీ టీచర్. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. పాలసముద్రం మండలంలోని టీవీఎన్‌ఆర్‌పురం అంగన్వాడీ కేంద్రం సరిగా తెరవడం లేదని నిరసిస్తూ గత శుక్రవారం ఆ కేంద్రానికి సర్పంచ్ అమరావతి సమక్షంలో గ్రామస్తులు తాళం వేశారు. దీనిపై ఈ విషయం అన్ని పత్రికల్లోనూ ప్రచురితమైంది. ఈ అంశంపై శనివారం సాయంత్రం గంగాధరనెల్లూరు సీడీపీవో పద్మసునంద విచారణ చేపట్టి, సిబ్బందికి మెమో జారీ చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో తనపై రుద్రప్రసాద్ తండ్రి గణేష్ ఫిర్యాదు చేశాడని అంగన్వాడీ టీచర్ మునిలక్ష్మి కోపం పెంచుకుంది. ఆ కోపంతో సోమవారం కేంద్రానికి వచ్చిన రుద్రప్రసాద్‌ను ఆయా చంద్రమ్మ కోడలితో కలిసి వాతలు తేలేలా కొట్టారు. ఆ చిన్నారి ఏడుస్తూ ఇంటికొచ్చి తల్లిదండ్రులకు విషయం తెలిపాడు. ఈ విషయమై మధ్యాహ్నం సీడీపీవోకు గ్రామస్తులతో కలిసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అంగన్వాడీ టీచర్‌ను, ఆయా చంద్రమ్మ కోడలిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jun 17 , 2025 | 01:45 AM