ఆంధ్రజ్యోతి- ఐఆర్‌ఎంఎస్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:36 AM
తిరుపతి నగరంలో ఆంధ్రజ్యోతి- ఐఆర్‌ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్) సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 19, 20వ తేదీల్లో ఎడ్యుకేషన్ ఎక్స్‌పో-2025 జరగనుంది. ఎయిర్‌బైపాస్ రోడ్డులోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాలులో ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా కొనసాగుతుంది. దక్షిణ భారతదేశంలోని 30 ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఎక్స్‌పోలో పాల్గొంటున్నాయి. ఇంటర్మీడియట్ లేదా ప్రీ డిగ్రీ తర్వాత ఏ కోర్సుచేయాలనే సందిగ్థంలో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఎక్స్‌పోను సందర్శిస్తే తగిన అవగాహన కలుగుతుంది. ఆయా విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, కోర్సుల వ్యవధి, వాటి ఫీజులు తదితర వివరాలతో పాటు విదేశీ విద్యకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎక్స్‌పోను సందర్శించడానికి, సమాచారం పొందడానికి అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి రుసుం లేదు. ఏకకాలంలో దక్షిణ భారతదేశంలోని ఇన్ని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఒకే వేదికపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జిల్లాతో పాటు నగరంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
తిరుపతి/తిరుపతి(విద్య), ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలో ఆంధ్రజ్యోతి- ఐఆర్‌ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్) సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 19, 20వ తేదీల్లో ఎడ్యుకేషన్ ఎక్స్‌పో-2025 జరగనుంది. ఎయిర్‌బైపాస్ రోడ్డులోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాలులో ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా కొనసాగుతుంది. దక్షిణ భారతదేశంలోని 30 ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఎక్స్‌పోలో పాల్గొంటున్నాయి. ఇంటర్మీడియట్ లేదా ప్రీ డిగ్రీ తర్వాత ఏ కోర్సుచేయాలనే సందిగ్థంలో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఎక్స్‌పోను సందర్శిస్తే తగిన అవగాహన కలుగుతుంది. ఆయా విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, కోర్సుల వ్యవధి, వాటి ఫీజులు తదితర వివరాలతో పాటు విదేశీ విద్యకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎక్స్‌పోను సందర్శించడానికి, సమాచారం పొందడానికి అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి రుసుం లేదు. ఏకకాలంలో దక్షిణ భారతదేశంలోని ఇన్ని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఒకే వేదికపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జిల్లాతో పాటు నగరంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఎక్స్‌పోలో పాల్గొనే సంస్థలు
అపోలో యూనివర్శిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఎడ్యుకేషనల్ ఎక్స్‌పోకు రాజ్యలక్ష్మి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ స్పాన్సర్‌గా, ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(రామాపురం) కో స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ దిగ్గజ సంస్థలతోపాటు ఐఐటీ మద్రాసు, ఆకాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, ఆచార్య, అనురాగ్ యూనివర్శిటీ, వేల్స్, బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్శిటీ, మార్వాడీ యూనివర్శిటీ, చెట్టినాడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,సీఎంఆర్ యూనివర్శిటీ, జీఆర్టీ గ్రూ ప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, కింగ్స్ కార్నర్ స్టోన్ ఇంటర్నేషనల్ కాలేజ్, ఎన్‌ఐటీటీఈ డీమ్డ్ టుబి యూనివర్సిటీ, ఎన్‌ఎంఐఎంఎ్‌స డీమ్డ్ టుబి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పీస్, మెడికో అబ్రాడ్ కన్సల్టెంట్స్, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, శ్రీనివాస అకాడమీ, భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఆర్ అకాడమీ, అమిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ సంస్థలు ఈ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పోలో పాల్గొననున్నాయి.
Updated Date - Apr 18 , 2025 | 12:36 AM