ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మరి మిగతా అక్రమ కేసుల సంగతేమి?

ABN, Publish Date - Apr 25 , 2025 | 01:39 AM

వైసీపీ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనల్ని కూడా అడ్డుకునేది. జీవో 1 పేరుతో 2023 జనవరిలో సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించకుండా పోలీసులు అడ్డుకున్నారు. 2023 ఆగస్టులో ఆయన సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చినప్పుడూ అన్నమయ్య జిల్లా అంగళ్లులో, పుంగనూరులో వైసీపీ నాయకులు ఆటంకం కలిగించారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ వైసీపీ నేతలు టీడీపీ శ్రేణుల్ని కవ్వించి మరీ రెచ్చగొట్టారు. అంగళ్లులో రాళ్లదాడి చేయగా.. చంద్రబాబు మీద కూడా రాళ్లు వేశారు. ఈ ఘటనలో దేవినేని, అమర్నాథ్‌రెడ్డి వంటి 20 మంది కీలక నేతలతో సహా సుమారు 700 మందికిపైగా కార్యకర్తలపై ముదివేడు పోలీ్‌సస్టేషనులో కేసులు నమోదు చేశారు. తాజాగా అన్నమయ్య జిల్లా పోలీసులు అవన్నీ తప్పుడు కేసులని నిర్ధారించి మూసేస్తున్నట్లు కోర్టుకు వివరాలు అందించారు.

- ‘అంగళ్లు’ కేసుల మూసివేతతో జిల్లాలో చర్చ

- వైసీపీ హయాంలో టీడీపీలో క్రియాశీల

నాయకులపై వందలాది కేసులు

- పుంగనూరు ఘర్షణతో చిత్రహింసలు

- టీడీపీ వచ్చి ఏడాదవుతున్నా..

అక్రమ రౌడీషీట్ల తొలగింపేదీ?

టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కావస్తున్నా.. వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులు, రౌడీ షీట్ల విషయంలో పురోగతి లేదు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన విషయం తెలిసిందే. పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల్లో అక్రమ కేసుల బాధితుల సంఖ్య వందల్లో ఉంది. అప్పట్లో అంగళ్లులో నమోదైన కేసుల్ని తప్పుడు కేసులుగా నిర్ధారించి క్లోజ్‌ చేశారు. దీంతో మన జిల్లాలోని అక్రమ కేసుల మాటేంటని టీడీపీ శ్రేణులు ఆందోళన పడుతున్నాయి.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

వైసీపీ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనల్ని కూడా అడ్డుకునేది. జీవో 1 పేరుతో 2023 జనవరిలో సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించకుండా పోలీసులు అడ్డుకున్నారు. 2023 ఆగస్టులో ఆయన సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చినప్పుడూ అన్నమయ్య జిల్లా అంగళ్లులో, పుంగనూరులో వైసీపీ నాయకులు ఆటంకం కలిగించారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ వైసీపీ నేతలు టీడీపీ శ్రేణుల్ని కవ్వించి మరీ రెచ్చగొట్టారు. అంగళ్లులో రాళ్లదాడి చేయగా.. చంద్రబాబు మీద కూడా రాళ్లు వేశారు. ఈ ఘటనలో దేవినేని, అమర్నాథ్‌రెడ్డి వంటి 20 మంది కీలక నేతలతో సహా సుమారు 700 మందికిపైగా కార్యకర్తలపై ముదివేడు పోలీ్‌సస్టేషనులో కేసులు నమోదు చేశారు. తాజాగా అన్నమయ్య జిల్లా పోలీసులు అవన్నీ తప్పుడు కేసులని నిర్ధారించి మూసేస్తున్నట్లు కోర్టుకు వివరాలు అందించారు.

పుంగనూరులో ఇలా..

పుంగనూరులో చంద్రబాబు రాకముందే వైసీపీ శ్రేణులు నల్ల దుస్తులతో ధర్నాలు చేసి కవ్వించారు. పోలీసులు కూడా కవ్విస్తున్న వైసీపీ శ్రేణుల్ని కాకుండా చంద్రబాబు పుంగనూరులోకి రాకుండా బైపా్‌సలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ పోలీసులకు, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలూ గాయపడ్డాయి. దీన్ని అదనుగా భావించి పెద్దిరెడ్డి, పోలీసులు.. స్పాట్‌లో లేనివారిపై సైతం అక్రమంగా 502 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టేశారు. వందల మందిని జైళ్లకు పంపించారు. ఇక్కడ మాత్రం అక్రమ కేసులు, రౌడీషీట్ల తొలగింపు విషయంగా కదలిక లేదు.

ఎందుకు అక్రమ రౌడీషీట్లు అంటే..

సాధారణంగా ఓ వ్యక్తి పదే పదే నేరాలకు పాల్పడితే, అతనిపై కనీసం మూడుకుపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదై ఉంటే రౌడీషీట్‌ను తెరుస్తారు. కానీ, పుంగనూరు ఘటనలో మాత్రం ఎలాంటి నేర చరిత్ర లేని వంద మందిపై షీట్లను తెరిచారు. వారంతా కేవలం 2023 ఆగస్టు 5న జరిగిన ఘర్షణలో పాల్గొన్నారనే కారణంగా కేసుల్లో ఇరికించేశారు. సుమారు వంద మందిపై రౌడీషీట్లను తెరిచారు.

సీఎం చంద్రబాబు చెప్పినా..

సీఎం చంద్రబాబు ఈ ఏడాది జనవరిలో కుప్పంలో పర్యటించినప్పుడు ‘వైసీపీ హయాంలో తెరచిన రౌడీషీట్లన్నీ అక్రమమే. నిబంధనలతోపాటు మానవత్వం కోణంతో కూడా ఆలోచించి తొలగించాలి’ అని ఎస్పీకి సూచించారు. అంతకుముందు పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబు పలుమార్లు అక్రమ రౌడీషీట్లను తొలగించాలని పోలీసు ఉన్నతాధికారుల్ని కోరారు. ఏం జరిగినా అక్రమ కేసుల కొట్టివేత, అక్రమ రౌడీషీట్ల ఎత్తివేత దిశగా జిల్లా పోలీసులు కసరత్తు ప్రారంభించలేదు. తాజాగా అంగళ్లు కేసుల కొట్టివేత తర్వాతైనా జిల్లా పోలీసుల్లో కదలిక వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నారు.

పుంగనూరు, కుప్పంలను టార్గెట్‌ చేసి వేధింపులు

వైసీపీ హయాంలో పుంగనూరు, కుప్పం కేంద్రంగా పెద్దిరెడ్డి రాజకీయం చేసి, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టేవారు. ఎస్‌ఐ నుంచి ఎస్పీ వరకు జీ హుజూర్‌ అని పెద్దిరెడ్డిని ప్రసన్నం చేసుకునేవారు. అలా 2023 జనవరి 4న చంద్రబాబును పోలీసులు కుప్పంలో పర్యటించకుండా అడ్డుకున్నారు. చంద్రబాబును చూసేందుకు వెళ్తున్న శ్రేణులపై శాంతిపురం మండలం గొల్లపల్లె క్రాస్‌ వద్ద లాఠీచార్జి చేశారు. 15 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టారు. 2022 ఆగస్టు 24, 25 తేదీల్లో చంద్రబాబు పర్యటించే ప్రాంతంలో వైసీపీ నాయకులు జెండాలు కట్టి రెచ్చగొట్టారు. కుప్పంలో అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసి నిర్వాహకుడ్ని కొట్టారు. అయినా వారిపై కేసులు పెట్టని పోలీసులు.. ఆ రెండ్రోజుల్లో ఏకంగా 72 మందిపై కేసులు పెట్టి 14 మందిని జైలుకు పంపించారు. ఇలా ఐదేళ్లపాటు నిత్యం అక్రమ కేసులతో టీడీపీ శ్రేణుల్ని వేధించేవారు.

Updated Date - Apr 25 , 2025 | 01:39 AM