ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇద్దరిపై కేసు నమోదు

ABN, Publish Date - Jul 11 , 2025 | 01:59 AM

ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శివకుమార్‌పై దాడి కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న బంగారుపాళ్యం సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు.

బంగారుపాళ్యం, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శివకుమార్‌పై దాడి కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న బంగారుపాళ్యం సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. చిత్తూరుకు చెందిన చక్రి, జీడీ నెల్లూరు మండలం ముక్కల్తూరుకు చెందిన వినోద్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బైరెడ్డిపల్లెకు చెందిన ప్రకాష్‌ ఆచారిపై కేసు నమోదు చేశామని, అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న మరికొందరిపై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ తెలిపారు.

రోడ్డుపై కాయలు పోసిన ఐదుగురిపై కేసు

రెండు ట్రాక్టర్ల సీజ్‌

జగన్‌ పర్యటన సందర్భంగా బంగారుపాళ్యం మండలం తిమ్మోజుపల్లె సమీపంలో రోడ్డుపై మామిడికాయలను పోసిన ఐదు గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. తుంబపాళ్యానికి చెందిన దేవేంద్ర, డ్రైవర్లు అక్బర్‌, ఉదయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రెండు ట్రాక్టర్లను సీజ్‌ చేశామన్నారు. తిమ్మోజుపల్లెకు చెందిన ప్రకాష్‌, భరత్‌రెడ్డిలపై కూడా కేసు నమోదు చేశామని,వారిద్దరూ పరారీలో ఉన్నారని తెలిపారు. అలాగే జగన్‌ పర్యటన సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించి రోడ్డు షో నిర్వహించిన ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు.మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌,బంగారుపాళ్యం మండల వైసీపీ కన్వీనర్‌ పాలేరు రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ కుమార్‌రాజా, కిశోర్‌కుమార్‌రెడ్డి, గజేంద్రలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jul 11 , 2025 | 01:59 AM