ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రీవెన్స్‌లో 95శాతం రెవెన్యూ సమస్యలే

ABN, Publish Date - Apr 22 , 2025 | 01:12 AM

ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వస్తున్న వినతుల్లో దాదాపు 95 శాతం రెవెన్యూ సమస్యలకు సంబంధించినవే వుంటున్నాయని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల గోడు ఆలకిస్తున్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, జేసీ విద్యాధరి

ప్రతి సోమవారం పలమనేరులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

పలమనేరు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వస్తున్న వినతుల్లో దాదాపు 95 శాతం రెవెన్యూ సమస్యలకు సంబంధించినవే వుంటున్నాయని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. ఇందులో డీకేటీ కుటుంబ తగాదాలు, ఆర్‌ఓఆర్‌ ఆన్‌లైన్‌ రికార్డుల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పలమనేరు ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారమే ప్రత్యేక అజెండాగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. పలమనేరు రెవెన్యూ డివిజిన్‌ పరిధిలో సమస్యల పరిష్కారానికి రానున్న మూడునెలల పాటు ప్రతి సోమవారం ప్రజాసమస్యల వేదిక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని తహసిల్దార్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. న్యాయపరమైన చిక్కులు , కుటుంబ తగాదాల నేపథ్యంలో వినతుల పరిష్కారం ఆలస్యమవుతోందన్నారు. వచ్చే మూడు నెలల కాలంలో పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కారవేదిక నిర్వహించి ముఖ్యంగా భూసమస్యల పరిష్కారానికి చర్యలు చూపుతామన్నారు. వినతుల పరిష్కారానికి అఽధికారులకు సరిపడా సమయం ఇస్తున్నామన్న ఆయన నాణ్యమైన పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. జిల్లాలో పీజీఆర్‌ఎస్‌ ద్వారా 53వేల వినతులందగా వాటిలో 12వేల అర్జీలు కుప్పం నియోజకవర్గం నుంచే అందిన క్రమంలో కుప్పంలో పర్యటించి సాధ్యమైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. అదే తరహాలో మిగిలిన నియోజకవర్గాల పరిధిలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామన్నారు.ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమ నిర్వహణ పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదేవిధంగా అధికార యంత్రాంగాన్ని ప్రజలదగ్గరకు పంపి వారి సమస్యలకు పరిష్కారమార్గం చూపించారన్నారు.పుంగనూరులో గతంలో జమిందారీ వ్యవస్థ ఉండడం, పలమనేరులో కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా రెవెన్యూ సమస్యలు ఉత్పన్నమయ్యాయన్న ఆయన కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామన్నారు.జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యే ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు మొత్తం 428 ఫిర్యాదులను అధికారులు వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.ఈ ఫిర్యాదుల్లో ఆన్‌లైన్‌ మ్యూటేషన్‌కోసం 87,పట్టాదారు పాసుపుస్తకాల కోసం 86, భూవివాదాలపై 66,రీ సర్వేపై 37, ఆక్రమణలపై 36, ఆర్వోఆర్‌పై 23, దారిసమస్యలపై 18, ఇళ్లపట్టాలకోసం 16, పెన్షన్స్‌కోసం 14. రేషన్‌కార్డులకోసం 4 అర్జీలు వున్నాయి.ఎస్పీ మణికంఠ,జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి, డీఆర్వో కె.మోహన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 01:12 AM