ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తొలి ఏడాది రూ.881 కోట్లు

ABN, Publish Date - Jun 17 , 2025 | 01:24 AM

ఎట్టకేలకు జిల్లా ప్రగతి బాట పట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి ఏడాదిలో రూ.881 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. నిర్వహణ లోపంతో దెబ్బతిన్న రోడ్లకు కొత్తరూపు తెప్పించింది. పల్లెలకు వెలుగులు పరిచింది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన జరిగింది.

కూటమి ప్రభుత్వం వచ్చాక బాగుపడిన నాయుడుపేట- రాపూరు రోడ్డు

జిల్లా అభివృద్ధికి ఖర్చుచేసిన ప్రభుత్వం

ఐదేళ్ల తర్వాత కనిపిస్తున్న ప్రగతి జాడలు

ఎట్టకేలకు జిల్లా ప్రగతి బాట పట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి ఏడాదిలో రూ.881 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. నిర్వహణ లోపంతో దెబ్బతిన్న రోడ్లకు కొత్తరూపు తెప్పించింది. పల్లెలకు వెలుగులు పరిచింది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన జరిగింది. వ్యవసాయానికి సాయం అందింది. ఐదేళ్ల పాటు సమస్యలతో అస్తవ్యస్తమైన జిల్లాలో ఇప్పుడిప్పుడే ప్రగతి జాడలు కనిపిస్తున్నాయి.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

చెదిరిన రోడ్లకు రూ.31.70 కోట్లతో కొత్త రూపు

జిల్లావ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ పరిధిలోని రహదారులన్నీ గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహణ లేక తారు, కంకర లేచిపోయి గోతులతో అధ్వాన్నంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు జిల్లాలో రోడ్లు వాహనదారులకు నరకం చూపించాయి. గతేడాది జూన్‌లో ప్రభుత్వం మారడంతో రోడ్ల రూపు కూడా మారింది. జిల్లావ్యాప్తంగా 1053 కిలోమీటర్ల మేర రోడ్లకు రూ.22.44 కోట్లతో 122 మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో రోడ్లన్నీ యధాస్థితికి చేరాయి. కొత్తగా రూ.9.26 కోట్లతో 54.44 కిలోమీటర్ల నిడివి కలిగిన మూడు తారు రోడ్లను నిర్మించారు.

రూ.360 కోట్లతో జాతీయ రహదారుల ముస్తాబు

జిల్లాలో జాతీయ రహదారులు అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. తిరుపతి నుంచీ దాదాపు ఏ మార్గం తీసుకున్నా జాతీయ రహదారే. అయితే కొత్త రోడ్డు ప్రాజెక్టులు, పాత రోడ్లకు మరమ్మతుల విషయమై సమీక్షించి, అవసరమైన ప్రతిపాదనలు చేసే ప్రయత్నాలేవీ గత వైసీపీ ప్రభుత్వంలో జరగలేదు. దీంతో పూతలపట్టు-నాయుడుపేట సిక్స్‌ లేన్‌ రోడ్డు, పీలేరు-తిరుపతి ఫోర్‌ లేన్‌ రోడ్డు, రేణిగుంట-పుత్తూరు-చెన్నై రోడ్డు వంటి కీలక రోడ్డు ప్రాజెక్టులన్నీ దాదాపుగా ఆగిపోయాయి. గతేడాది ప్రభుత్వం మారాకే వీటిల్లో పురోగతి మొదలైంది. ఎన్‌హెచ్‌ఏఐ నెల్లూరు పరిఽధికి సంబంధించి ఈ జిల్లాలో రూ.318.45 కోట్లతో 71.2 కిలోమీటర్లు నిర్మాణం జరగగా, చెన్నై పరిధికి సంబంధించి ఈ జిల్లాలో రూ.41.50 కోట్లతో ఎన్‌హెచ్‌ 716 రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి.

రూ.270 కోట్లతో పల్లెకు వెలుగు

గత జూన్‌ నుంచీ ఇప్పటి వరకూ రూ.270 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.20.23 కోట్లతో పాడిరైతులకు మేలు జరిగేలా గోకులాల పేరిట 1499 పశువులకు షెడ్లు నిర్మించారు. ఇదే పథకం కింద రూ.141.75 కోట్లతో 5279 సామాజిక పనులు చేపట్టారు. పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ పరిధిలో రూ.104.40 కోట్లతో 209.77 కిలోమీటర్ల నిడివి కలిగిన 1663 సీసీ రోడ్లు నిర్మించారు. రూ.3.18 కోట్లతో 4.80 కిలోమీటర్ల మేరకు మూడు తారు రోడ్ల నిర్మాణం చేపట్టారు. అదే విధంగా రూ. 56 లక్షలతో 2.76 కిలోమీటర్ల మేరకు ఐదు మెటల్‌ రోడ్లు నిర్మించారు.

రూ.21 కోట్లతో పట్టణాల్లో మౌలిక వసతులు

జిల్లాలో తిరుపతి కార్పొరేషన్‌తో పాటు శ్రీకాళహస్తి, పుత్తూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి తదితర ఆరు మున్సిపపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో రూ.21.68 కోట్లతో 180 పనులు చేపట్టారు. ఇందులో అంతర్గత రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంతో పాటు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పనులూ ఉన్నాయి.

సాగు, తాగునీటికి రూ.22 కోట్లు

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ శాఖ పరిధిలో రూ.12.32 కోట్లతో బోర్ల తవ్వకాలు, పంప్‌ సెట్లు అమర్చడం, పైప్‌ లైన్లు వేయడం, డ్రెయిన్ల నిర్మాణం, శ్మశానాలకు నీటి సరఫరా తదితర 452 పనులు చేపట్టారు. అదే సమయంలో రూ.10.05 కోట్ల అంచనా వ్యయంతో ఇరిగేషన్‌ శాఖ చెరువుల పటిష్టీకరణకు, సప్లయ్‌ చానళ్లు, తూముల మరమ్మతుల వంటి పనులు పూర్తి చేసింది.

రూ.122 కోట్లతో వ్యవ‘సాయం’

జిల్లాలో గడచిన ఏడాది కాలంలో వ్యవసాయం, పండ్ల తోటల పెంపకాలకు సంబంధించి రైతులకు కూటమి ప్రభుత్వం రూ.122 కోట్ల సాయం అందించింది. 6015 ఎకరాలకు బిందు సేద్య సదుపాయం కల్పించడానికి రూ. 19.36 కోట్లు వెచ్చించారు. వివిధ సందర్భాల్లో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారంగానూ, డ్రోన్లు పంపిణీ చేయడానికి, సబ్సిడీ విత్తనాలు అందించడానికి, పీఎం కిసాన్‌, పొలం పిలుస్తోంది తదితర కార్యక్రమాలకు రూ.97.58 కోట్లు ఖర్చు చేశారు. మరోవైపు 10.212 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి రూ.4.92 కోట్ల సాయాన్ని రైతులకు అందజేసింది.

మహిళాభివృద్ధికి రూ. 53.77 కోట్లు

డీఆర్‌డీఏ ద్వారా 2703 మంది మహిళా వ్యాపారవేత్తలకు రూ.41.28 కోట్లు, 12,821 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 12.49 కోట్ల రుణాలు అందజేసింది. ఇలా మహిళాభివృద్ధికి రూ.53.77 కోట్లు వెచ్చించింది.

Updated Date - Jun 17 , 2025 | 01:24 AM