4జూన్, 2024 జిల్లా ఊపిరి పీల్చుకున్న వేళ
ABN, Publish Date - Jun 04 , 2025 | 01:55 AM
వైసీపీ అరాచకాలకు భయపడి నోరు కట్టేసుకున్న జనం, నిశ్శబ్ద ఆయుధంలా పేలారు. ఓట్ల ప్రభంజనం సృష్టించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2019లో కుప్పం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ విజయవిహారం చేసిన పార్టీని 2014లో కుప్ప కూల్చేశారు. విర్రవీగిన నాయకుల నడ్డి విరిచేశారు. అయితే.. ఫలితాల సరళి వెల్లడయ్యేదాకా భీతావహమైన ఉత్కంఠ క్షణాలు జిల్లాలో రాజ్యమేలాయి. వైసీపీ మూకల అరాచకాలను ఎదుర్కొన్నవారూ, బలైనవారూ, పోరాడుతూవున్నవారూ గుండెలు అరచేతిలో పెట్టుకునే గడిపారు. ఒకవేళ మళ్లీ వారే గెలిస్తే.. అనే అనుమాన బీజం వారిని వణికించింది. విజయం కూటమిదే అని వెల్లడయ్యాక జిల్లా ఊపిరి పీల్చుకుంది. అందుకు దారి తీసిన ఐదేళ్ల అరాచక పరిస్థితులనూ, ఓట్ల లెక్కింపు రోజునాటి ఉత్కంఠతనూ జనం ఇలా గుర్తు చేసుకుంటున్నారు..
- వైసీపీ అరాచక పాలనకు జనం సమాధికట్టిన రోజు
లబ్..డబ్.. లబ్..డబ్.. అంటూ గుండె చప్పుళ్లు బయటకే వినిపిస్తున్నాయి.
22 రెండు రోజుల పాటూ ఓట్లను గుండెల్లో దాచుకున్న ఈవీఎం పెట్టెలు ఏం చెప్పబోతున్నాయి?
ఎవరు గెలవబోతున్నారు?
మళ్లీ అరాచక రాజ్యం వస్తే బతికేదెట్లా?
ఆస్తులు దక్కుతాయా? పొలాలు మిగులుతాయా?
బెదరింపులు.. కేసులు.. అరెస్టులు.. దాడులు.. దౌర్జన్యాలను ఇంకో ఐదేళ్లు భరించడం సాధ్యమేనా?
..... ఏడాది కిందట సరిగ్గా ఇదే రోజున జిల్లా ప్రజల మదిలో మెదిలిన భయాలోచనలు ఇవి.
వైసీపీ అరాచకాలకు భయపడి నోరు కట్టేసుకున్న జనం, నిశ్శబ్ద ఆయుధంలా పేలారు. ఓట్ల ప్రభంజనం సృష్టించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2019లో కుప్పం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ విజయవిహారం చేసిన పార్టీని 2014లో కుప్ప కూల్చేశారు. విర్రవీగిన నాయకుల నడ్డి విరిచేశారు. అయితే.. ఫలితాల సరళి వెల్లడయ్యేదాకా భీతావహమైన ఉత్కంఠ క్షణాలు జిల్లాలో రాజ్యమేలాయి. వైసీపీ మూకల అరాచకాలను ఎదుర్కొన్నవారూ, బలైనవారూ, పోరాడుతూవున్నవారూ గుండెలు అరచేతిలో పెట్టుకునే గడిపారు. ఒకవేళ మళ్లీ వారే గెలిస్తే.. అనే అనుమాన బీజం వారిని వణికించింది. విజయం కూటమిదే అని వెల్లడయ్యాక జిల్లా ఊపిరి పీల్చుకుంది. అందుకు దారి తీసిన ఐదేళ్ల అరాచక పరిస్థితులనూ, ఓట్ల లెక్కింపు రోజునాటి ఉత్కంఠతనూ జనం ఇలా గుర్తు చేసుకుంటున్నారు..
-చిత్తూరు, ఆంధ్రజ్యోతి
గుండెలు అరచేతిలో పెట్టుకుని...
పెద్దిరెడ్డి అనుచరుల అరాచకాలతో ఐదేళ్ల పాటు ప్రాణ భయంతో బతికాం. పుంగనూరులో న్యాయవాదిగా ఉన్న నేను టీడీపీకి సానుభూతిపరుడిగా ఉండడమే నేను చేసిన నేరం. నాపై 11 కేసులు పెట్టి రౌడీషీట్ తెరిచారు. మా ఇల్లు, ఆస్తులపై వైసీపీ మూకలు దాడులు చేశాయి. బాధితులుగా ఉన్న మాపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేశారు. ఈ అరాచక పాలన అంతం అయితే తప్ప మేం ప్రశాంతంగా ఉండలేమని అర్థం అయ్యింది. చంద్రబాబు గెలవాలని దేవుళ్లను ప్రార్థించాను. ఓట్ల లెక్కింపు రోజు ఎంతో గుండెలు అరచేతిలో పెట్టుకుని గడిపాను. వైసీపీ వస్తే కచ్చితంగా మా ఇంటిని ధ్వంసం చేస్తారు. ఊళ్లో లేకుండా వెళ్లిపోయాను. టీవీ దగ్గరే గడిపాను. టీడీపీ గెలవడంతో ఊపిరి పీల్చుకున్నాను. పుంగనూరుకు వచ్చి సంబరాలు చేసుకున్నాను. ప్రస్తుతం పుంగనూరు ప్రశాంతంగా ఉంది.
- నవీన్‌కుమార్ యాదవ్ (ఫోటో: 2సీటీఆర్19)
ప్రాణం లేచి వచ్చింది
వైసీపీ వచ్చాక పెద్దిరెడ్డి పుణ్యమా అని నాపై 8 తప్పుడు కేసులు నమోదు చేసి రౌడీషీట్ తెరిచారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణల కేసుల్లో నన్ను ఇరికించారు. అప్పటి కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు నా నోట్లో గుడ్డ కుక్కి చిత్రహింసలు పెడుతూ వైసీపీ వాళ్లకు వీడియో కాల్ చేసి చూపించారు. ఇటువంటి చోట బతికేది ఎలా అనుకున్నాను. పోలింగ్ రోజున ఓటేసి హైదరాబాద్ వెళ్లిపోయాను. ఓట్ల లెక్కింపు రోజు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ టీవీ చూస్తూ గడిపాను. టీడీపీ గెలుస్తోందని అర్థం అయ్యాక ప్రాణం లేచివచ్చింది. చావు అంచుల వరకు వెళ్లి వెనక్కి వచ్చినట్లు అనిపించింది. ఆ తర్వాతే హైదరాబాద్ నుంచి పులిచెర్ల కు తిరిగి వచ్చాను.
-ముళ్లంగి వెంకటరమణ (ఫోటో: 2సీటీఆర్20)
ఊరొదిలి పోయే ప్రమాదం తప్పింది
ఇంత దుర్మార్గమైన కాలాన్ని ఎవరూ ఎప్పుడూ చవిచూసి ఉండరు. టీడీపీలో యాక్టీవ్‌గా ఉన్నాననే ఏకైన కారణంగా నాపై 18 అక్రమ కేసులు పెట్టారు. మా కుటుంబంలో 14 మంది ఉండగా.. మొత్తం 42 కేసులు పెట్టారు. నేను ఆరు నెలలు, కుటుంబ సభ్యులు 3 నెలలు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. లెక్కింపు రోజున చంద్రబాబుకు కౌంటింగ్ ఏజెంట్‌గా కేంద్రంలో ఉన్నాను. ఒకటే ఆందోళన. ఒకవేళ రాష్ట్రంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే కుటుంబంతో సహా బయటి ప్రాంతాలకు వెళ్లిపోదామనే అనుకున్నాం. అరాచకపాలన అంతమైంది అని ఫలితాలు చాటి చెప్పడంతో ఆనందం ఉప్పెనలా మారింది. ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నాం.
-జయశంకర్, రామకుప్పం (ఫోటో: 2సీటీఆర్18)
========= టాప్ టెన్ అరాచకాలు========
1. 2020-21 సంవత్సరాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు పెట్రేగిపోయారు. ప్రతిపక్ష నాయకులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, రాళ్ల దాడులు చేయడం, నామినేషన్ వేసినవారిని అక్రమ కేసులతో భయపెట్టడం వంటి అరాచకాలతో అక్రమంగా మెజార్టీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారు. చివరికి సార్వత్రిక ఎన్నికల రోజు తెల్లవారుజామున కూడా సదుం మండలం బూరగమందలో పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేశారు.
2. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ కార్యక్రమంలో భాగంగా 2023 ఆగస్టు 4న చంద్రబాబు పుంగనూరుకు వస్తున్న క్రమంలో వైసీపీ నాయకులు, పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా పోలీసుల మీద తిరగబడ్డారు. ఈ ఒక్క సంఘటనను ఆధారం చేసుకుని నియోజకవర్గంలో యాక్టీవ్‌గా ఉండే టీడీపీ నాయకులు, కార్యకర్తలు 502 మంది మీద హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సుమారు వంద మందిపై అక్రమంగా రౌడీ షీట్లను తెరిచారు.
3. చంద్రబాబును సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా జీవో 1 పేరుతో ప్రభుత్వం అడ్డుకున్న విషయం తెలిసిందే. 2023 జనవరి 4న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు శాంతిపురం మండలం గొల్లపల్లె క్రాస్ వద్దకు టీడీపీ శ్రేణులు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడున్న సీఐ, ఎస్‌ఐలు మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. సుమారు పది మందికి గాయాలవ్వగా, నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందారు. 15 మంది మీద హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
4. 2022 ఆగస్టు 24, 25 తేదీల్లో కుప్పం చంద్రబాబు పర్యటనలో వైసీపీ నాయకులే జెండాలు కట్టి రెచ్చగొట్టారు. కుప్పంలో అన్నక్యాంటీన్‌ను ధ్వంసం చేసి నిర్వాహకుడ్ని కొట్టారు. అయినా వారిపై కేసులు పెట్టలేదు. పైగా టీడీపీ వారు 72 మందిపై కేసులు పెట్టి 14 మందిని జైలుకు పంపించారు.
5. నాణ్యత లేని మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని సోమల మండలం కందూరుకు చెందిన వైసీపీ దళిత కార్యకర్త ఓంప్రతాప్ 2020 ఆగస్టు 25న మదనపల్లెలోని ఓ మద్యం దుకాణం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను దూషించారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. మరుసటిరోజు ఓంప్రతాప్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
6. 2023 నవంబరు 3న పులిచెర్లకు చెందిన టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణను అప్పటి కల్లూరు సీఐ శ్రీనివాసులు హైదరాబాదులో అరెస్టు చేశారు. కల్లూరు పోలీ్‌సస్టేషన్‌కు తీసుకొచ్చి కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డ కుక్కి దారుణంగా కొట్టారు. సీఐ వెంకటరమణను కొడుతున్నప్పుడు ఎవరో ఓ వైసీపీ నేతకు వీడియో కాల్ చేసి చూపించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
7. చౌడేపల్లె మండలం బోయకొండలోని భవానీనగర్‌లో ఎకరా డీకేటీ పొలాన్ని సాగు చేసుకుంటున్న దళితులైన శ్రీనివాసులు, రమణమ్మ దంపతుల పొలాన్ని పక్క పొలం వారైన కృష్ణమూర్తి కుమారులు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. వీరికి స్థానిక వైసీపీ నాయకులు మద్దతుగా వచ్చారు. అందరూ కలిసి మహిళలు, వికలాంగులని కూడా చూడకుండా బాధితుల్ని కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.
8. చెన్నై- బెంగుళూరు హైవే నిర్మాణంలో మిగిలిపోయిన కంకరను వైసీపీ నాయకులు బెంగుళూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని పులిచెర్ల మండలం చల్లావారిపల్లెకు చెందిన శివకుమార్ ప్రశ్నించారు. 2022 జూలైలో వైసీపీ కార్యకర్తలు దాడి చేసి కొట్టి రోడ్డు పక్కన పడేశారు.
9. సదుం మండలం బూరగమందకు చెందిన రాజారెడ్డి టీడీపీలో యాక్టీవ్‌గా ఉంటున్నారని 2022 ఏప్రిల్‌లో కిడ్నాప్ చేసి రెండు కాళ్లూ విరిచేశారు. కల్లూరులోని పెట్రోల్ బంకు సమీపంలో తోసేశారు.
10. బీసీవై అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని ఎన్నో దాడులకు పాల్పడ్డారు. రైతు భేరి నిర్వహణకు అనుమతి కోరితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 2022 డిసెంబరులో ఓ రాత్రి వందల మంది వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లు, రాడ్లతో ఆయన ఇంటిపై దండెత్తారు. ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఆయన ఉద్యోగ మేళా నిర్వహించబోగా, అనుమతి లేదంటూ వేదికను పోలీసులు కూల్చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రామచంద్రపై యర్రాతివారిపల్లెలో హత్యాయత్నం జరిగింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే సదుం స్టేషన్ వద్ద రణరంగం సృష్టించారు.
11. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమానికి వెళ్తున్న టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా బాబును సోమలలో వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. రాళ్ల వర్షం కురిపించారు. నంజంపేట వద్ద టీడీపీ శ్రేణుల కార్ల అద్దాలు పగలగొట్టారు.
12. పుంగనూరు నుంచి కుప్పం చంద్రబాబు ప్రోగ్రామ్‌కు భారీఎత్తున బయల్దేరాడని టీడీపీ నేత ఎస్‌కే రమణారెడ్డి ఇంటి స్థలం ప్రహరీ, షెడ్లను కూల్చేశారు. టీడీపీ కార్యకర్త హేమాద్రిని పుంగనూరులో కిడ్నాప్ చేసి అతని చేతిలో డ్రగ్స్ పెట్టి వీడియోలు తీసి, కేసుల్లో ఇరికించారు.
13. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ 2023 అక్టోబరు 2న శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్తలు కుప్పం వరకు సైకిల్‌యాత్ర చేపట్టారు. అదే నెల 20న యాత్ర పుంగనూరుకు చేరుకుంది. అక్కడి వైసీపీ నేత చెంగలాపురం సూరి దుర్భాషలాడుతూ సైకిళ్లపై జెండాలు పీకేయించి, వారు ధరించి పసుపు రంగు దుస్తుల్ని విప్పించి బూతులు తిట్టారు.
14. 2023 జనవరి చివర్లో కుప్పం నుంచి మొదలైన లోకేశ్ యువగళం పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేశారు. పైగా చిత్తూరు జిల్లాలో 6, తిరుపతి జల్లాలో 9 చొప్పున కేసుల్ని పెట్టారు. వీటిలో ఐందింటిలో నారా లోకేశ్ పేరును ఇరికించారు.
Updated Date - Jun 04 , 2025 | 01:55 AM