ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

1,78,262ఎకరాల్లో ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

ABN, Publish Date - May 25 , 2025 | 01:07 AM

ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు.ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం సాగుకు అనుకూలంగా మారడంతో దుక్కి దున్ని నేలను సిద్ధం చేసుకునేందుకు రైతులు పనులు ప్రారంభించారు.

విత్తనాలకోసం రైతుల ఎదురుచూపులు

చిత్తూరు సెంట్రల్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు.ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం సాగుకు అనుకూలంగా మారడంతో దుక్కి దున్ని నేలను సిద్ధం చేసుకునేందుకు రైతులు పనులు ప్రారంభించారు.జిల్లావ్యాప్తంగా 1,78,262 ఎకరాల్లో 22 రకాల పంటలు సాగు చేయనున్నారు. 88,095 ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు.అయితే వేరుశనగ విత్తనాల కొరత రైతులకు ఇబ్బందికరంగా మారింది.విత్తనాలతో పాటు విత్తనశుద్ధి మందులు సబ్సిడీపై పంపిణీ చేయాల్సి ఉన్నా, ఇంకా వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్‌ ప్రణాళికలు సిద్ధం కావాలంటూ కాలయాపన చేస్తుండడంపై రైతుల్లో అసహనం వ్యక్తమవుతోంది.

22 రకాల పంటల సాగు

ఖరీ్‌ఫలో ప్రధాన పంటగా చెప్పుకునే వేరుశనగ 88,095 ఎకరాల్లో , వరి 28,010 ఎకరాల్లో, సజ్జలు 220ఎకరాల్లో, జొన్నలు 1510ఎకరాల్లో, మొక్కజొన్న 1195ఎకరాల్లో, సామలు 437.5ఎకరాల్లో, రాగి 5922.5ఎకరాల్లో, కొర్రలు 30ఎకరాల్లో, కందులు 6412.5ఎకరాల్లో, ఉద్దిపప్పు (మినుములు) 250ఎకరాల్లో, ఉలవలు 4232.5ఎకరాల్లో, పెసలు 332.5ఎకరాల్లో, ఆవుగడ్డి 1160ఎకరాల్లో, అనుములు 1330ఎకరాల్లో, సీసమమ్‌ 12.5ఎకరాల్లో, పొద్దుతిరుగుడు 2.5ఎకరాల్లో, ఆముదం 5ఎకరాల్లో, పత్తి 27.5ఎకరాల్లో, చెరకు 18,732.5ఎకరాల్లో, గడ్డి 17,127.5 ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నారు.

జాడ లేని విత్తనాల పంపిణీ

జిల్లావ్యాప్తంగా ఈ నెల 15న 502 రైతు భరోసా కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉండగా, ఆ ఊసే లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.88,095 ఎకరాల్లో వేరుశనగ సాగుకు 35 వేల క్వింటాళ్ల విత్తన కాయలు అవసరం కాగా, ఏపీ సీడ్స్‌ ద్వారా కే-6 రకం విత్తనాలు 30 వేల క్వింటాళ్ల సరఫరాకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులోనూ ప్రస్తుతం 26,354 క్వింటాళ్ళు మాత్రమే సరఫరా చేయనున్నారు. ఇందులోనూ 25977 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలు మాత్రమే డివిజన్లకు కేటాయించారు. చిత్తూరు డివిజన్‌కు 8540 క్వింటాళ్లు, నగరికి 2421 క్వింటాళ్లు, పుంగనూరుకు 7941 క్వింటాళ్లు, పలమనేరుకు 7075 క్వింటాళ్ళు కేటాయించారు. వీటితో పాటు పెసలు 37 క్వింటాళ్ళు, కందులు 323 క్వింటాళ్ళు, ఉలవలు 1720 క్వింటాళ్ళు, రాగి 280 క్వింటాళ్ళు, పచ్చరొట్టి 378 క్వింటాళ్లు, ఎండు జనపనార 1156 క్వింటాళ్ల విత్తనాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం 26,354 క్వింటాళ్ళ వేరుశనగ విత్తన కాయలతో పాటు మరో 13,984 విత్తన కాయల అవసరం వుందని, పెసలు 2639 క్వింటాళ్ళు కావాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్రస్థాయి అధికారులకు తెలిపారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ సమయంలో రైతులకు విత్తన శుద్ధి మందునూ అందించాల్సి ఉండగా, వ్యవసాయ శాఖాధికారులు దీనిపై దృష్టి సారించలేదు. వాస్తవానికి జూన్‌ నెలకు పక్షం రోజుల ముందే రైతులకు వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేస్తే దుక్కి దున్నుకున్న రైతన్న జూన్‌ నెల మొదటి వారంలో విత్తనాలు వేయాల్సి ఉంది. అంతకు ముందు వాటిని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది.

చాలీచాలని ఎరువులు

ఖరీఫ్‌ సీజన్‌లో 55 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం కాగా, 40,320 మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.యూరియా 26,793 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 3240 టన్నులు, ఎన్‌పీకే 8970 టన్నులు, ఎంవోపీ 453 టన్నులు, ఎంటీఎస్‌, ఎస్‌ఎ్‌సపీ 864 టన్నులు అవసరమని జిల్లా వ్యవసాయశాఖాధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినా, వీటిలో చాలా ఎరువులు ఇప్పటికీ అందుబాటులో లేకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 25 , 2025 | 01:07 AM