13,758 మంది ఆధార్ అప్‌డేట్ చేసుకోలేదు
ABN, Publish Date - Jun 17 , 2025 | 01:47 AM
ఆధార్ అప్‌డేట్ చేసుకోనివారు జిల్లాలో 13,758 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. ఇటువంటి వారిలో అర్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.
- వీరికోసం ఈనెల 24-27 తేదీల మధ్య ప్రత్యేక శిబిరాలు
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ఆధార్ అప్‌డేట్ చేసుకోనివారు జిల్లాలో 13,758 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. ఇటువంటి వారిలో అర్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రేషన్‌కార్డుల్లో పేర్ల నమోదుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చాలాచోట్ల పిల్లల చేతివేళ్లు, ఐరిష్ అప్‌డేట్ చేసుకోలేదని తెలిసింది. దీనివల్ల తాజాగా తల్లికి వందనం పథకానికి కూడా చాలామంది అర్హులు దూరమయ్యారు. ఇటువంటి వారికోసం ఈనెల 24నుంచి 27వ తేదీవరకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించాలని జీఎ్‌సడబ్ల్యూఎస్ రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. జిల్లాలో 122 సచివాలయాల్లో శిబిరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
Updated Date - Jun 17 , 2025 | 01:47 AM