పిల్లలను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలి
ABN, Publish Date - May 04 , 2025 | 11:39 PM
పిల్లలను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బర్మా సురేష్ కుమార్ అన్నారు.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.సురేష్ కుమార్
కర్నూలు హాస్పిటల్, మే 4 (ఆంధ్రజ్యోతి): పిల్లలను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బర్మా సురేష్ కుమార్ అన్నారు. గత రెండు రోజులుగా నగరంలోని బిర్లా కాంపౌండులో జేవీవీ ఆధ్వర్యంలో రెండు రోజులు సెల్‌ఫోన అడిక్షన శిక్షణ జరిగింది. ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్‌ఫోన ఆడిక్షన నుంచి దృష్టి మళ్లించేందుకు వారిలో సృజనాత్మకతను వెలుగు తీసేందుకు శిక్షణ ఎంతో దోహదపడిందన్నారు. ప్రముఖ మేథ మ్యూజిక్స్ స్కిల్స్ అకాడమి డైరెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ పిల్లలు రోజంతా సెల్‌ఫోన ఉపయోగించకుండా మనం చిన్న చిన్న వస్తువులతో ఎలా అదుపు చేయవచ్చని వివరించారు. జేవీవీ వ్యవస్థాపకులు డా.వి.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు సెల్‌ఫోనకు అడిక్షన కావడం ద్వారా కంటి, మెడ, వెనముక సమస్యలు తలెత్తుతాయన్నారు. దీని వల్ల రాబోయే కాలంలో పిల్లల్లో సృజనాత్మకత తగ్గుతుందన్నారు. కర్యాక్రమంలో జేవీవీ నాయకులు బాషా, ప్రతాప్ రెడ్డి, రమేష్, పాల్గొన్నారు.
Updated Date - May 04 , 2025 | 11:39 PM