ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chevireddy Role: చెవిరెడ్డి కి ఏమీ తెలియదా

ABN, Publish Date - Jun 21 , 2025 | 04:56 AM

నేను మద్యం జోలికి వెళ్లను, వెళ్లలేదు’ అని ఈ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పదేపదే చెబుతున్నారు. అయితే అది నిజం కాదని, మద్యం క్యాష్‌ డీలింగ్స్‌లో ఆయన పాత్ర కీలకమని కట్టా ప్రణయ్‌ ప్రకాశ్‌ ఇచ్చిన వాం గ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది.

నేను మద్యం జోలికి వెళ్లను, వెళ్లలేదు’ అని ఈ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పదేపదే చెబుతున్నారు. అయితే అది నిజం కాదని, మద్యం క్యాష్‌ డీలింగ్స్‌లో ఆయన పాత్ర కీలకమని కట్టా ప్రణయ్‌ ప్రకాశ్‌ ఇచ్చిన వాం గ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది. దీని ప్రకారం మద్యం ముడుపులను ప్రణయ్‌ ప్రకాశ్‌ పలుమార్లు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మనుషులకు అందించారు. కూటమి సర్కారు వచ్చి మద్యం స్కామ్‌పై దర్యాప్తునకు ఆదేశించగానే ఇతర కీలక వ్యక్తులతోపాటు ప్రకాశ్‌ కూడా విదేశాలకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ప్రకాశ్‌తో ఫోన్‌లో, ఆ తర్వాత స్వయంగా మాట్లాడారు. ‘‘ఆఫ్రికాలో అరైజ్‌ అనే కంపెనీకి చెందిన వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను. అక్కడ నువ్వు కంపెనీ పెట్టుకోడానికి ఆయన సహాయం చేస్తారు. ఎన్నికల సమయంలో డబ్బులు తరలించిన సంగతి ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ చెప్పొద్దు’’ అని స్పష్టం చేశారు. తాను టాంజానియాలో ఉండగా చెవిరెడ్డితోపాటు ఆయన కుమారుడు మోహిత్‌ రెడ్డి, సన్నిహితుడు వెంకటేశ్‌ నాయుడు కలిసినట్లు ప్రణయ్‌ తన వాంగ్మూలంలో చెప్పినట్లు తెలిసింది.

లక్షలకు లక్షలు...

ప్రణయ్‌ ప్రకాశ్‌ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తాడేపల్లిలో అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌కు ఒక్కో విడతలో రూ.20 లక్షల నుంచి 25 లక్షలను అట్టపెట్టెల్లో తీసుకొచ్చి ఇచ్చేవారు. ఆ డబ్బులను చాణక్య సూచనలు, ఆదేశాల ప్రకారం చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తరఫు వ్యక్తులకు అప్పగించేవారు. 2023 జూన్‌ నుంచి 2024 ఏప్రిల్‌ మధ్యకాలంలో సుమారు 20 సార్లు చెవిరెడ్డి మనుషులు బాలాజీ, గిరి, గన్‌మ్యాన్‌ మదన్‌ డబ్బులు తీసుకెళ్లారు. డబ్బు తరలింపునకు కియా కార్నివాల్‌, బెంజ్‌, ఇన్నోవా క్రిస్టా కార్లు ఉపయోగించారు. చాలా డిస్టిలరీల నుంచి డబ్బు వచ్చేదని అందులో బీ9, పీవీ డిస్టిలరీల పేర్లు మాత్రం తనకు గుర్తున్నాయని ప్రణయ్‌ ప్రకాశ్‌ చెప్పినట్లు తెలిసింది.

Updated Date - Jun 21 , 2025 | 06:33 AM