ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chevireddy: మీరెవరో నాకు తెలియాలి..

ABN, Publish Date - Jun 20 , 2025 | 05:42 AM

శంకర్‌ అంటే ఎవరు.. సుధాకర్‌ అంటే నువ్వేనా.. అమీద్‌ ఎక్కడ.. -ఇదేదో అధికారి సిబ్బందికి వేసిన ప్రశ్నలు కావు. మద్యం కేసులో సిట్‌ విచారణకు హాజరైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధికారులను నిలదీసిన వైనమిది.

  • మదన్‌ రాసిన లేఖలో ఉన్న అధికారుల పేర్లు అడిగి అతి చేసిన చెవిరెడ్డి

విజయవాడ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘శంకర్‌ అంటే ఎవరు.. సుధాకర్‌ అంటే నువ్వేనా.. అమీద్‌ ఎక్కడ..’ -ఇదేదో అధికారి సిబ్బందికి వేసిన ప్రశ్నలు కావు. మద్యం కేసులో సిట్‌ విచారణకు హాజరైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధికారులను నిలదీసిన వైనమిది. వారి అంతు చూస్తానన్నట్లుగా హావభావాలు ప్రదర్శించినట్లు సమాచారం. బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేసి మంగళవారం రాత్రి బెజవాడ సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు ఆయన్ను అక్కడ విచారించిన సంగతి తెలిసిందే. కార్యాలయంలోకి అడుగు పెట్టగానే చెవిరెడ్డి అధికారుల వంక చూసి వారి పేర్లు అడిగారు. సిట్‌ విచారణలో పది మంది అధికారులు తనను చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ ఆయన గన్‌మన్‌ మదన్‌రెడ్డి కొద్దిరోజుల క్రితం డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందులో ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌, ఎస్‌ఐ అమీద్‌, సుధాకర్‌ పేర్లు రాశారు. ఆ చాంబర్‌లో ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ కూడా ఉండడంతో.. చెవిరెడ్డికి, ఆయనకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మదన్‌పై ఎవరూ చేయి చేసుకోలేదని, తానీ మాటలను ఆత్మసాక్షిగా చెబుతున్నానని.. అలాగే మదన్‌ కూడా తాము కొట్టామని ఆత్మసాక్షిగా చెప్పగలడా అని శంకర్‌ ప్రశ్నించడంతో చెవిరెడ్డి నోరెత్తలేదని సమాచారం.

చెవిరెడ్డిని కస్టడీకి ఇవ్వండి ఏసీబీ కోర్టులో సిట్‌ పిటిషన్‌

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి రిమాండ్‌పై జైల్లో ఉన్న చెవిరెడ్డిని, ఆయన స్నేహితుడు చెరుకూరి వెంకటేశ్‌నాయుడిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్‌ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌ నుంచి మద్యం డబ్బును తరలించిన వారిలో కొంత మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి పాత్రపై ఆరా తీయడానికి ఈ ఇద్దరినీ ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jun 20 , 2025 | 05:43 AM