Nellore: రొట్టెల పండగకు పోటెత్తిన భక్తజనం
ABN, Publish Date - Jul 07 , 2025 | 03:51 AM
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండగ ఆదివారం నెల్లూరులో అట్టహాసంగా ప్రా రంభమైంది. బారాషహీద్ దర్గాలో దర్శనం కోసం తొలిరోజే భక్తులు బారులుతీరారు.
తొలిరోజే కిటకిటలాడిన బారాషహీద్ మైదానం
భక్తిశ్రద్ధలతో సందల్‌మాల్.. నేటి అర్ధరాత్రి గంధమహోత్సవం
నెల్లూరు (సాంస్కృతికం), జూలై 6 (ఆంధ్రజ్యోతి): మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండగ ఆదివారం నెల్లూరులో అట్టహాసంగా ప్రా రంభమైంది. బారాషహీద్ దర్గాలో దర్శనం కోసం తొలిరోజే భక్తులు బారులుతీరారు. స్వర్ణాల చెరువు ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించి, వరాల రొట్టెలను మార్చుకున్నారు. అర్ధరాత్రి మత పెద్దలు, ముస్లిం నేతలు, ప్రజాప్రతినిధులు, పోలీసు బందోబస్తు మధ్య సందల్‌మాల్ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. 10వ తేదీ వరకు జరిగే పండగ కోసం ఉభయ తెలుగురాష్ట్రాలతోపాటు తమిళనాడు, కేరళ, కర్నాటక, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రధాన ఘట్టమైన గంధమహోత్సవం సోమవారం అర్ధరాత్రి తర్వాత జరగనుంది. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, మహ్మద్ ఫరూక్, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
Updated Date - Jul 07 , 2025 | 03:52 AM