Central Funds: కేంద్రం నుంచి రూ.వేల కోట్లు తెస్తున్నాం
ABN, Publish Date - May 29 , 2025 | 05:25 AM
జగన్ ప్రభుత్వానికి కేంద్ర పథకాలు వినియోగించుకోవడం చేతకాక నష్టపోయినట్టు పేర్కొంటూ, చంద్రబాబు తెలివిగా కేంద్రం నుంచి నిధులు సాధిస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతి రింగురోడ్డుకు సంబంధించి కేంద్రాన్ని ప్రభావితం చేసిన చంద్రబాబు దూరదృష్టిని మంత్రి ప్రశంసించారు.
‘జగన్‌కు కేంద్ర పథకాలను వాడుకోవడం చేతకాలేదు. మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వక చాలా నష్టపోయాం. ఇప్పుడు చంద్రబాబు తెలివిగా కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు తెస్తున్నారు. పోలవరం కోసం చంద్రబాబు కేంద్రంలో ఎంత కష్టపడ్డారో ప్రత్యక్షంగా చూశా. ఈ ఏడాది రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.9వేల కోట్లు కేటాయించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 160 అడుగులు, 14 లేన్ల రోడ్డును అమరావతి రింగురోడ్డుకు కేంద్రం ప్రతిపాదించగా.. దాన్ని 230 అడుగులు చేయాలని చంద్రబాబు కోరారు. నేను లేకపోయినా నా రాష్ట్ర ప్రజలు దీనిని అనుభవించాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ప్రతి నియోజకవర్గంలో రూ.20కోట్ల ఉపాధి నిధులతో సీసీ రోడ్లు వేస్తున్నాం’ - కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్,
(అంశం: రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం)
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News
Updated Date - May 30 , 2025 | 03:03 PM