అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబు లక్ష్యం
ABN, Publish Date - Jul 08 , 2025 | 11:50 PM
అభివృద్ధి సంక్షేమం సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి పేర్కొ న్నారు.
ప్రొద్దుటూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి సంక్షేమం సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి పేర్కొ న్నారు. మంగళవారం స్థానిక కొత్తపల్లె పంచా య తీలోని వివేకానంద నగర్‌లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా కొండారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని గట్టేక్కిస్తున్నార న్నారు. ఎన్నికలల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పఽథకాలన్ని అమలు చేస్తున్నారన్నారు. రాజ ధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు కూడా వేగవంతంగా సాగుతుందన్నారు. అన్నదాత సుఖీభవ పేర 20 వేల ఆర్థిక సహాయం అందజేయనున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి ,కొత్తపల్లె సర్పంచ శివచంద్రా రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఈవీ సుధాకర్ రెడ్డి వాల్మీకి బోయ కార్పొరేషన డైరెక్టర్ నల్లబోతు నాగ రాజు, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు, సుదర్శన తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయం
బద్వేలుటౌన/రూరల్, జులై 8 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ నియోజక వర్గ ఇనచార్జి రితేష్‌కుమార్‌రెడ్డి, కూటమి నాయ కుడు రోశన్నలు పేర్కొన్నారు. మంగళవారం సుపరి పాలనతో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సురేంధ్రనగర్, లక్ష్మీపాలెం గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా 4వేల రూపాయల పెన్షనను 1వ తేదీనే అందిస్తున్నారన్నా రు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన సూర్యనారా యణరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంగల్‌రెడ్డి, నరసింహానాయుడు, శివయ్యస్వామి, ఊట్ల సుబ్బరా మయ్య, జీవీ సుబ్బారెడ్డి, మస్తా నబాబు, చెన్నయ్య, రవికుమార్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పీరయ్య, శ్రీను పాల్గొన్నారు.
ప్రజలు మెచ్చే విధంగా చంద్రబాబు పాలన
ఎర్రగుంట్ల, జూలై 8(ఆంధ్రజ్యోతి): ప్రజలు మెచ్చే విధంగా సీఎం చంద్రబాబునాయుడు పరిపాలన ఉందని జమ్మలమడుగు నియోజవర్గ ఇనచార్జి సి.భూపేష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎర్ర గుంట్ల మండలంలోని పి.వెంకటాపురంలో సుపరి పాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈసందర్భంగా బూత నెంబరు 251 పరిధిలోని ఇంటింటికి తిరిగి మంచి ప్రభుత్వం ఏడాది కాలం లో అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిం చారు. మండల పరిషత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. మండల ఇనచార్జి మధు సూధనరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మేకల మోహనరెడ్డి, స్థానిక నాయకులు బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, రామక్రిష్ణారెడ్డి, గోపాల్‌యాదవ్, నాగిరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, చంద్ర ఓబుళ్ రెడ్డి, నాగేంద్ర, వీరారెడ్డి, రమణారెడ్డి, నాగరాజు, మల్లారెడ్డి, సత్యనారాయణ, క్లస్టర్, బూత కన్వీనర్, కో కన్వీనర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 11:50 PM