ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: జగన్‌తో జాగ్రత్త

ABN, Publish Date - Jul 19 , 2025 | 06:13 AM

జగన్‌ ఆరితేరిన నేరగాడు. ఆయన నేర మనస్తత్వాన్ని అంచనా వేయడం చాలా కష్టం. నేరం చేసి దాన్ని ఎదుటి వారిపై నెట్టేయడం ఆయన నైజం. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయకపోతే రాష్ట్రం చాలా నష్టపోతుంది.

TDP vs YSRCP
  • ఆరితేరిన నేరగాడు

  • ఢిల్లీ స్థాయిలో ఈ విషయం ఎండగట్టండి

  • రాజకీయ ఎదురుదాడిలో వెనకబడుతున్నారు

  • రాష్ట్రానికి నిధుల సాధనకు కృషి చేయండి

  • ప్రాజెక్టులపై నిరంతర సంప్రదింపులతోనే ఫలితాలు

  • కేంద్రం నుంచి ఉపాధి నిధులు అలాగే తెచ్చాం

  • స్థానిక వివాదాల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు

  • టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం

రెంటపాళ్ల పర్యటన జరిగిన రెండుమూడు రోజుల తర్వాత, జగన్‌ కారు కిందే సింగయ్య పడి మృతి చెందాడన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వస్తే గానీ తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఆనాడు సొంత బాబాయ్‌ని గొడ్డలితో నరికేసి, దాన్ని గుండెపోటుగా చిత్రీకరించడంలో జగన్‌ సక్సెస్‌ అయ్యారు. అప్పుడూ మనమే అధికారంలో ఉన్నాం. కానీ నిజాన్ని నిగ్గుతేల్చడంలో పూర్తిగా విఫలమయ్యాం. మామిడి, పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్‌ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు చేసే నేరాలు.. అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం వెనుకబడుతున్నాం. ఇకపై అప్రమత్తంగా ఉండండి.

- టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌ ఆరితేరిన నేరగాడు. ఆయన నేర మనస్తత్వాన్ని అంచనా వేయడం చాలా కష్టం. నేరం చేసి దాన్ని ఎదుటి వారిపై నెట్టేయడం ఆయన నైజం. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయకపోతే రాష్ట్రం చాలా నష్టపోతుంది. ఢిల్లీ స్థాయిలోనూ జగన్‌ నేర మనస్తత్వాన్ని ఎండగట్టాలి.’ అని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో జగన్‌ పరామర్శల పేరుతో చేస్తున్న అరాచకాలను సీఎం ప్రస్తావించారు. ‘‘క్రిమినల్స్‌ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందనేది జగన్‌ ప్రవర్తనతో అర్ధమవుతుంది. జగన్‌ నేరమనస్తత్వాన్ని అంచనా వేయడంలో మనం ఎప్పటికప్పుడు వెనుకబడుతున్నాం. వైసీపీ నేతలు అధికారం కోసం ఎంతకైనా.. ఎటువంటి చర్యలకైనా తెగిస్తారనడానికి ఇటీవల రెంటపాళ్ల పర్యటనలో జరిగిన సింగయ్య మృతే నిదర్శనం.

తన సొంత కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడి చనిపోయే పరిస్థితిలో ఉంటే మానవత్వం లేకుండా జగన్‌ ప్రవర్తించిన తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. జగన్‌ కారు డ్రైవర్‌ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు. అలా తీసుకురాకుండా చేయడంలో జగన్‌, ఆయన అనుచరులు విజయం సాధించారు. రెంటపాళ్ల పర్యటన జరిగిన రెండుమూడు రోజుల తర్వాత, జగన్‌ కారు కిందే పడి సింగయ్య మృతి చెందాడన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వస్తే తెలుసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. జగన్‌ కారు కింద పడి తన భర్త చనిపోయాడని సింగయ్య భార్య ఫిర్యాదు చేస్తే, ఆ కేసులో నిందితుడిగా ఉన్న జగన్‌ సింగయ్య కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకుని.. లోకేశ్‌ కోటి రూపాయలు ఇస్తానని ఆశ చూపారంటూ ఆమెతో తప్పుడు ఆరోపణలు చేయించారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ జగన్‌ క్రిమినల్‌ ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయో చూశాం. సొంత బాబాయ్‌ను గొడ్డలితో నరికేసి, దాన్ని గుండెపోటుగా చిత్రీకరించడంలో సక్సెస్‌ అయ్యారు. అప్పుడు మనమే అధికారంలో ఉన్నాం. కానీ నిజాన్ని నిగ్గు తేల్చడంలో పూర్తిగా విఫలమయ్యాం. ఇలాంటి నేరగాళ్లు ప్రజాధనాన్ని కూడా ఎంత పకడ్బందీగా స్వాహా చేస్తారనే దానికి మద్యం స్కాం మంచి ఉదాహరణ. మామిడి, పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్‌ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. వైసీపీ నేతలు చేసే నేరాలు.. అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం వెనుకబడుతున్నాం. ఇకపై అప్రమత్తంగా ఉండండి.’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

మామిడి రైతులకు న్యాయం మీ బాధ్యతే..

‘‘రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలి. నేను కచ్చితమైన సమాచారంతో ఉండబట్టే ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో రాష్ట్రానికి మేలు కలిగేలా వాదనలు వినిపించగలిగాను. సబ్జెక్ట్‌ పరంగా అవగాహన పెంచుకోండి. ఎప్పటికైనా అది ఉపయోగపడుతుంది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ వారు నోటికొచ్చిన విమర్శలు చేస్తే దానిపై సంపూర్ణ అవగాహన ఉండబట్టే వారికి దీటుగా సమాధానం ఇవ్వగలిగాను. తెలంగాణ సీఎం రేవంత్‌ నాకు తెలంగాణ ముఖ్యం అంటే....నేను తెలుగు రాష్ట్రాలు ముఖ్యం అని చెప్పాను. తాజా రాజకీయ పరిణామాలపై అవగాహన ఉంటే మనం ఏ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకోవాలనేది మీకు అవగాహన ఉంటుంది. మామిడి రైతులకు కేంద్రం నుంచి అందాల్సిన సాయం వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఎంపీలపై ఉంది. పల్ప్‌ పరిశ్రమలకు జీఎస్టీ తగ్గించే అంశంపైనా కేంద్రంతో సంప్రదింపులు జరపాలి.’’

అధికారాన్ని ప్రజలకోసం వినియోగించాలి..

‘‘స్థానిక వివాదాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. వన్‌టైం ఎంపీలుగా మిగిలిపోయేలా ప్రవర్తించవద్దు. రాష్ట్రం సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రజలు మనకు ఓట్లు వేసి అధికారం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో ఎంపీలనూ ఇచ్చారు. దీన్ని మనం రాష్ట్రాభివృద్ధి కోసం వినియోగించుకోవాలి. ఎంపీలు ప్రజలతో మమేకమవ్వాలి. మీ నియోజకవర్గంలో కొత్తగా ఏ ప్రాజెక్టు తీసుకురావాలి.. కేంద్రం నుంచి అదనంగా నిధులు ఎలా తెచ్చుకోవాలి వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించండి.’’

రాష్ట్ర ప్రగతిని ఢిల్లీలో చాటండి..

‘‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లండి. సమయానుకూలంగా వ్యవహరించి సభలో క్వాంటమ్‌ వ్యాలీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యా లీ, జనాభా నిర్వహణ, పీ4 వంటి అంశాల్లో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించండి. నేరపూరిత రాజకీయ అంశాల ప్రస్తావన వచ్చినప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలనూ వివరించండి.’’ అని చంద్రబాబు సూచించారు.

ఇప్పుడు మాట్లాడటం సరికాదు: లావు

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రానికి అదనపు నిధులు ఎలా తీసుకురావాలనే అంశంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. భారత్‌ గౌరవ్‌ ట్రైన్‌ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక రైళ్లను రాష్ట్రంలో ఎక్కువగా నడిచేలా చూడాలని సూచించారని తెలిపారు. మద్యం కుంభకోణం విచారణ తుది దశలో ఉన్నందున ఇప్పుడు దానిపై మాట్లాడటం సరికాదని లావు అన్నారు.

ఎంపీల పనితీరు, హాజరు భేష్‌ అభినందించిన సీఎం చంద్రబాబు

పార్లమెంటులో టీడీపీ ఎంపీల పనితీరు బాగుందంటూ సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మీరు క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరవుతున్నారు. సమర్థవంతంగా సమస్యలను వినిపిస్తున్నారు. ఎంపీల హాజరులో దేశవ్యాప్తంగా సగటు 85 శాతం ఉంటే, టీడీపీ ఎంపీలది 86.2 శాతం ఉంది. చర్చల్లో పాల్గొనడంలోను, ప్రశ్నలు అడగడంలోనూ మీ పనితీరు బాగుంది. పార్లమెంటులో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంతోపాటు ప్రధాని మోదీ చేస్తున్న మంచినీ ప్రస్తావించండి. ఆపరేషన్‌ సిందూర్‌, ఎమర్జెన్సీకి 50 ఏళ్లు వంటి అంశాలపై చర్చల్లో చురుగ్గా పాల్గొని కేంద్రానికి మద్దతు తెలపండి.’’ అంటూ చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

పెండింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి..

‘‘రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయండి. పార్లమెంటు సమావేశాలను సద్వినియోగం చేసుకోండి. రైతులకు మద్దతు ధర, నదీ జలాలు, పారిశ్రామీకకరణ వంటి అంశాలను పార్లమెంటులో ప్రస్తావించండి. ఆయా ఆంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించడంతోపాటు కేంద్రం నుంచి ఆశిస్తున్న సాయాన్ని పార్లమెంటు ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి. కేంద్ర ప్రాయోజిత పథకాలు వీలైనంత ఎక్కువగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేయండి. ప్రతి ఎంపీకీకొన్ని శాఖలను అప్పగించాం. కేంద్రం స్థాయిలో ఆయా శాఖల్లో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ ప్రాజెక్టులు ఏమున్నాయనేది దృష్టి సారిస్తూ వాటి సాధనకు కృషి చేయండి. నిరంతరం ఆయాశాఖలకు చెందిన కేంద్రమంత్రులతో మాట్లాడుతూ ఉండండి. అలా నిరంతర సంప్రదింపుల వల్లే ఉపాధి హామీకి సంబంధించి పెండింగ్‌ బిల్లులు సాధించగలిగాం. ప్రతి అంశంపైనా ఎంపీలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి.’’

Updated Date - Jul 19 , 2025 | 10:43 AM