Chandrababu: అవినీతి ఉండొద్దు
ABN, Publish Date - Jun 15 , 2025 | 04:35 AM
జీరో కరెప్షన్ లక్ష్యంగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ శాఖలో ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు.
జీరో కరెప్షన్ లక్ష్యంగా ఏపీ.. ఎవరు అవినీతికి పాల్పడినా సహించం
ఆరోపణలు వస్తే తక్షణ విచారణ.. రుజువైతే ఆ వెంటనే చర్యలు తప్పవు
ఐవీఆర్‌ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సమీక్షలో చంద్రబాబు స్పష్టీకరణ
175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు.. ఆగస్టు 15 నాటికి
అన్ని సేవలూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి
10 ముఖ్య సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరించాలని సీఎం దిశానిర్దేశం
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై అత్యధిక శాతం ప్రజలు సంతృప్తి
అమరావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): ‘జీరో కరెప్షన్’ లక్ష్యంగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ శాఖలో ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని, అవినీతి రుజువైతే తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి.. వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన అభిప్రాయాలపై శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్టు ఐవీఆర్‌ఎస్, సీఎ్‌సడీఎస్ అభిప్రాయ సేకరణలో వెల్లడైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని, సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి.. వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వివరాలతో పాటు పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియజేయాలని ఆదేశించారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర) ద్వారా అందించాలని తెలిపారు. మరోవైపు దివ్యాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకువెళ్లి అందించే ప్రక్రియ మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచన చేయాలని అధికారులను ఆదేశించారు. చౌకధరల దుకాణాలను పెంచడం, నగదు లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలంటూ సీఎం దిశానిర్దేశం చేశారు. ఉచిత ఇసుక విధానం అమలులో ఇసుక లేని చోట్ల సంతృప్తి, ఇసుక ఉన్న చోట అసంతృప్తి ఉండటంపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలని చెప్పారు.
ప్రజాభిప్రాయం ఇలా..
పింఛన్ల పంపిణీలో అవినీతి లేదని 85 శాతం మంది, ఇంటి దగ్గరే ఇస్తున్నారని 87.80 శాతం, ఉద్యోగుల ప్రవర్తన బాగుందని 83.90 శాతం మంది ఐవీఆర్‌ఎస్ ద్వారా తెలిపారు. సీఎ్‌సడీఎస్ ఫీల్డ్ సర్వేలో లబ్ధిదారులను నేరుగా కలిసి ప్రశ్నించగా.. పింఛన్ల పంపిణీలో అవినీతి లేదని 93.90 శాతం, ఇంటి దగ్గరే ఇస్తున్నారని 93.30 శాతం, ఉద్యోగుల ప్రవర్తన బాగుందని 73.30 శాతం మంది చెప్పారు.
అన్న క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉన్నాయని 89.50 శాతం, ఆహారం నాణ్యత బాగుందని 79.30 శాతం, సమయపాలన పాటిస్తున్నారని 80.80 శాతం మంది ఐవీఆర్‌ఎస్ ద్వారా చెప్పారు.
ఆసుపత్రులలో క్వాలిటీ చెక్‌పపై 68.40 శాతం, రక్త పరీక్షలపై 55 శాతం, ఉచిత మందుల పంపిణీపై 65.5 శాతం, సిబ్బంది ప్రవర్తనపై 71.3 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీలలో రోజూ చెత్త సేకరణపై 68.10 శాతం, 24 గంటల్లో చెత్త డంప్ తరలింపుపై 57 శాతం మంది సంతృప్తి చెందారు.
ఆలయాల్లో సౌకర్యాలు బాగున్నాయని 63.60 శాతం, దర్శనం బాగుందని 68 శాతం, ప్రసాదం నాణ్యత బాగుందని 77.70ు భక్తులు చెప్పారు.
ఆర్టీసీ బస్సుల్లో సీటింగ్, శుభ్రతపై 53.40 శాతం, నీటి సౌకర్యంపై 45.20 శాతం, టాయిలెట్స్ నిర్వహణపై 56 శాతం, బస్సుల సమయం-రూటు వివరాలపై 61.50 శాతం, బస్సులు సమయానికి బయల్దేరుతున్నాయని 69 శాతం, సమయానికి గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయని 69.70ు, సిబ్బంది ప్రవర్తన బాగుందని 72.40 శాతం, భద్రత బాగుందని 69.70ు మంది చెప్పారు.
నెలనెలా రేషన్ సరుకులు తీసుకుంటున్నామని 75.10 శాతం, సరుకుల నాణ్యత బాగుందని 73.80 శాతం మంది చెప్పారు. దీపం-2 డెలివరీ చార్జీలు వసూలు చేయడం లేదని 62.8 శాతం మంది చెప్పారు.
ఎరువుల లభ్యత బాగుందని 60.90 శాతం మంది రైతులు చెప్పారు. సమయానికి విత్తనాల సరఫరా జరిగిందని 63 శాతం మంది తెలిపారు.
తమ ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ సంబంధిత సమస్య ఉందని 27.40 శాతం మంది చెప్పగా.. పోలీసులు స్పందిస్తున్నారని 54.50 శాతం మంది చెప్పారు. పబ్లిక్ ప్రాంతాల్లో మహిళలపై హింస, వేధింపులు ఉన్నాయని 27.8 శాతం మంది చెబితే.. పోలీసుల స్పందన బాగుందని 59.50 శాతం, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని 56.30 శాతం మంది చెప్పారు.
రిజిస్ట్రేషన్ సేవల్లో స్లాట్ బుకింగ్ ప్రాసె్‌సపై 63.40 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. అవినీతి లేదని 62.30 శాతం మంది చెప్పారు.
ఇసుక రిజిస్ట్రేషన్ ప్రాసె్‌సపై 70.60 శాతం, లభ్యతపై 67.50 శాతం, ధరపై 61.10 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ సేవల్లో ఎఫ్ లైన్‌పై డబ్బులు వసూలు చేయడం లేదని 75.10 శాతం మంది చెప్పారు. విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా అవుతోందని 61.60 శాతం మంది చెప్పారు. పంచాయతీల్లో ఇంటింటికీ చెత్తసేకరణ జరుగుతోందని 56.70 శాతం మంది చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద అడ్మిషన్లపై 86.20 శాతం, సేవలపై 81.30 శాతం మంది బాగుందని తెలిపారు.
సవాల్ చేస్తే... సౌండ్ ఆఫ్!
జగన్ ఆరోపణలపై లోకేశ్
‘బురద చల్లడం... పారిపోయి ప్యాలె్‌సలో దాక్కోవడం... జగన్‌కు అలవాటు’ అని మంత్రి లోకేశ్ ఎద్దేవా చేశారు. ‘తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వె ళ్లాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని చాలెంజ్ చేశాను. సమయం ముగిసినా రుజువు చేయలే దు. క్షమాపణ కోరలేదు. అందుకే మిమ్మల్ని ఫేక్ అనేది. లీగల్ యాక్షన్‌కు సిద్ధంగా ఉండండి. సమయం లేదు మిత్రమా! శరణమా... న్యాయ సమరమా? తేల్చుకోండి’ అంటూ లోకేశ్ సవాల్ చేశారు. టీడీపీ రాష్ట్రస్థాయి నేత నాదెండ్ల బ్రహ్మం స్పందిస్తూ... ‘రాష్ట్రం అభివృద్ధి చెందటం జగన్‌కి, అతని కాలకేయ ముఠాకు నచ్చదు.’ అని విమర్శించారు.
Updated Date - Jun 15 , 2025 | 05:30 AM