ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: రాజకీయాల్లో చీడపురుగులు

ABN, Publish Date - Jul 04 , 2025 | 03:00 AM

తప్పుడు ప్రచారం తాత్కాలికం.. చేసిన పనే శాశ్వతం. గతంలో నేనెప్పుడూ ఫేక్‌ ఫెలోస్‌తో రాజకీయం చేయలేదు. వీళ్లు ఫేక్‌. అవాస్తవాన్ని వాస్తవం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సింగయ్య మరణం, వివేకానందరెడ్డి హత్య విషయంలో వీళ్ల శవరాజకీయాలు అందరికీ తెలిసింది...

CM Chandrababu Naidu
  • వైసీపీ బ్యాచ్‌ రాష్ట్రానికే పెనుసవాల్‌గా మారారు: చంద్రబాబు

  • నేను ఫేక్‌ ఫెలోస్‌తో రాజకీయం చేయలేదు

  • అవాస్తవాలను వాస్తవంగా చూపే యత్నాలు

  • బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు

  • కుప్పంలో రెండో రోజు పర్యటనలో సీఎం

  • టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశం

శాంతిపురం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘తప్పుడు ప్రచారం తాత్కాలికం.. చేసిన పనే శాశ్వతం. గతంలో నేనెప్పుడూ ఫేక్‌ ఫెలో్‌సతో రాజకీయం చేయలేదు. వీళ్లు ఫేక్‌. అవాస్తవాన్ని వాస్తవం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సింగయ్య మరణం, వివేకానందరెడ్డి హత్య విషయంలో వీళ్ల శవరాజకీయాలు అందరికీ తెలిసింది’ అని వైసీపీ బ్యాచ్‌ తీరుపై సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. వీళ్లు రాజకీయాలకు చీడపురుగులుగా.. రాష్ట్రానికే ఓ పెనుసవాల్‌గా తయారయ్యారని మండిపడ్డారు. వీళ్లంతా కరుడుగట్టిన నేరస్థులని.. ఆర్థిక ఉగ్రవాదులని.. వీళ్లు చేసిన నేరాలు మామూలు రౌడీలు చేసి ఉంటే రెండు నిమిషాల్లో కుక్కను కొట్టినట్లు కొట్టి లోపలేసేవాళ్లమని స్పష్టంచేశారు. సొంత నియోజకవర్గం కుప్పంలో వరుసగా రెండోరోజు గురువారం ఆయన పర్యటించారు. ఉదయం శాంతిపురం మండలం కడపల్లెలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని పునరుద్ఘాటించారు.

వందేళ్ల నుంచి గోదావరిలో ఏటా సగటున 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లిపోతున్నాయని.. ఆ నీటిలో 200 టీఎంసీలు వాడుకుంటే తెలుగు ప్రజలు బాగుపడతారన్నారు. తెలంగాణలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులను తానెప్పుడూ వ్యతిరేకించలేదని.. వ్యతిరేకించనని తేల్చిచెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు, పల్ప్‌ పరిశ్రమల యజమానులతో సమావేశమై వారి డిమాండ్లువిన్నారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. డిమాండ్‌కు తగ్గ పంటలను సాగు చేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడిని పండించాలని సూచించారు. పరిశ్రమల సామర్థ్యానికి తగినట్లు మామిడి కాయలు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని యజమానులను కోరారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

ఫ్రీహోల్డ్‌పై తొందరపడం..

గత ప్రభుత్వ పాలనలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. ఫ్రీహోల్డ్‌ భూముల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే సమస్య మరింత జటిలమైపోతుంది. నాకు 10 అర్జీలు వస్తే 7-8 అర్జీలు భూ సమస్యలవే. అంతలా నాశనం చేశారు. ఈ భూముల విషయంలో ఎలాంటి సమస్య రాకుండా క్లియర్‌గా సెటిల్‌ చేస్తాం. పీ-4లో భాగంగా బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తుంటే.. దోచుకోవడం తప్ప ఖర్చు పెట్టడం తెలియని వాళ్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి వారితో మనం రాజకీయం చేయాల్సి వస్తోంది. నిన్న తిమ్మరాజుపల్లెలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపడితే తమ గ్రామంలోని కుటుంబాలను ఆదుకుంటామని ఓ కుటుంబం ముందుకొచ్చింది.

మామిడి రైతులకు 250 కోట్ల సబ్సిడీ..

ధరలు పతనమై ఇబ్బంది పడుతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు ఎన్నడూ ఇవ్వని విధంగా సబ్సిడీ రూపంలో రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు అందిస్తున్నాం. 2018లో ఓసారి ఇచ్చాం. ఇప్పుడు రెండోసారీ ఇస్తున్నాం. అప్పట్లో రాయలసీమకు అనుకూలమైన పంట కావడంతో మామిడిని ప్రమోట్‌ చేశాం. ఈసారి దిగుబడులు ఎక్కువ కావడంతో ధరలు పతనమై రైతులు ఇబ్బంది పడుతున్నారు. మామిడి సాగు తగ్గించాలని చెప్పేటప్పుడు దానిస్థానంలో ఏ పంట వేయాలో కూడా చెప్పగలగాలి. ఇక్కడ ఫ్యాక్టరీల సిండికేట్‌ అనేది ప్రధాన సమస్య కాదు. ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇస్తున్నా.. వాళ్లు కొనలేకపోతున్నారంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. మామిడికి ధర కల్పించలేదని విమర్శిస్తున్న వాళ్లు ఎప్పుడైనా రూపాయి సబ్సిడీ ఇచ్చారా? డ్రిప్‌ఇరిగేషన్‌ ఇచ్చారా? హంద్రీ-నీవాకు నిధులిచ్చారా? మామిడి రైతులకు సాయం చేయకుండా ఫ్యాక్టరీలతో కుమ్మక్కై కమీషన్లు తీసుకుంటున్నారు. ఇప్పటికే 60 శాతం కోత పూర్తయింది. త్వరలోనే రైతుల ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు వేస్తాం.

‘తొలి అడుగు’ను ప్రజల్లోకి తీసుకెళ్లండి..

టీడీపీ కార్యకర్తలతోనూ సీఎం సమావేశమయ్యారు. సుపరిపాలనలో తొలి అడుగు-ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడినవారికి ప్రాధాన్యమిస్తామన్నారు. త్వరలో లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌ ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం సాయంత్రం 5.10 గంటలకు హెలికాప్టర్‌లో సీఎం అమరావతికి తిరుగుపయనమయ్యారు.

Updated Date - Jul 04 , 2025 | 08:09 AM