AP Development: గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన
ABN, Publish Date - Aug 02 , 2025 | 04:50 AM
గండికోట ఇండియాకే గ్రాండ్ క్యానన్ అని సీఎం చంద్రబాబు అన్నారు. గండికోట వద్ద శుక్రవారం జరిగిన ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్‌కు చంద్రబాబు హాజరయ్యారు.
రూ.500 కోట్ల మేర ఒప్పందాలు
డిసెంబరు 26, 27 తేదీల్లో ఉత్సవాలు
ఇంటర్నెట్ డెస్క్: గండికోట ఇండియాకే గ్రాండ్ క్యానన్ అని సీఎం చంద్రబాబు అన్నారు. గండికోట వద్ద శుక్రవారం జరిగిన ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్‌కు చంద్రబాబు హాజరయ్యారు. గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతాన్ని యాంకర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ‘‘ప్రపంచంలో అతి సుందరమైన ప్రదేశాల్లో గండికోట 10వది. దీన్ని ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి మాస్టర్‌ప్లాన్ తయారుచేస్తున్నాం. రూ.80కోట్లతో పనులు ప్రారంభిస్తున్నాం. అక్కడే కృష్ణదేవరాయల విగ్రహం పెట్టిస్తాం. ఒకపక్క గండికోట, ఒంటిమిట్ట, మధ్యలో కడప దర్గా ఈ మూడు అనుసంధానం చేయగలిగితే ఈ ప్రాంతం ఆఽధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. కడపలో నేషనల్ హైవేస్‌కు ఒక్క ఏడాదిలోనే రూ.12వేలకోట్లు ఖర్చుచేశాం.’’ అని తెలిపారు. సాష్కీ, స్వదేశీ దర్శన్ పథకాల ద్వారా గండికోట, బొర్రా గుహలు, అహోబిళం, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. గండికోట ఉత్సవాలు డిసెంబరు 26, 27 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు గాను సీఎం సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈజ్‌మైట్రిప్, హిల్డెన్ హోటల్స్ సహా వివిధ సంస్థలు ఏపీ టూరిజం కార్పొరేషన్‌తో రూ.500 కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నాయి.
Updated Date - Aug 02 , 2025 | 04:51 AM