ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu Naidu: అధ్యక్షుడిగా 30 ఏళ్లు

ABN, Publish Date - May 28 , 2025 | 05:36 AM

చంద్రబాబు 1995 నుండి 30 ఏళ్లుగా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కడప మహానాడు వేదికగా ఆయన జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నిక అవుతున్న నేపథ్యంలో పార్టీ నాయకుల పనితీరుపై సర్వే జరిపారు.

నేడు మరోసారి టీడీపీ సారథిగా ఎన్నిక కానున్న చంద్రబాబు

టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1995లో తొలిసారి పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన.. అప్పటినుంచీ కొనసాగుతున్నారు. టీడీపీ అధ్యక్ష ఎన్నిక ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. 2014 రాష్ట్ర విభజన వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు.. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాదితో ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి 30ఏళ్లు పూర్తవుతాయి. ఈ ప్రస్థానంలో పార్టీ నిర్వహణలో ఆయన ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2004లో తొలిసారి టీడీపీ ఓటమిపాలైంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నుంచి టీడీపీ శ్రేణులు తీవ్ర అణచివేతను చవిచూశాయి. అన్నింటినీ ఎదుర్కొని 2009 ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీని వరుసగా రెండోసారి ఓటమి పలుకరించింది. ఇక పార్టీ కోలుకోవడం కష్టమని అంతా భావించారు. రెండో విడత సీఎం అయిన వైఎస్‌ టీడీపీపై ఉక్కుపాదం మోపారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో టీడీపీ అటు తెలంగాణ, ఇటు ఏపీలో నిలదొక్కుకునేందుకు చాలాశ్రమపడాల్సి వచ్చింది. అయితే చంద్రబాబుపై నమ్మకంతో 2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఆయన్ను గెలిపించడంతో కేడర్‌ ఊపిరి పీల్చుకుంది. అయితే 2019 ఎన్నికల్లో విజయం సాధించిన జగన్‌ రూపంలో మరోసారి ఉపద్రవం ముంచుకొచ్చింది. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఆయన తీవ్ర నిర్బంధం అమలు చేశారు. అవన్నీ ఎదుర్కొని 2024లో టీడీపీ మరోసారి సత్తా చాటింది. కడప మహానాడు వేదికగా చంద్రబాబు మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అవుతున్న నేపథ్యంలో ఆయన శ్రమ, దీక్ష, పట్టుదలను శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.


చర్చలపై సర్వే..

తీర్మానాలపై చర్చల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్‌, ప్రతి నాయకుడి పనితీరును చూస్తున్నామని.. వాట్సాప్‌, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సర్వే చేశామని చంద్రబాబు తన ప్రసంగంలో తెలిపారు. ‘కార్యకర్తే అధినేత’ కేటగిరీలో మంత్రి కొల్లు రవీంద్రకు 93 శాతం వచ్చిందన్నారు. ‘యువగళం’పై చర్చలో మంత్రి టీజీ భరత్‌కు 76.92 శాతం.. యువగళం, యువత సంక్షేమంలో వెంకటరాజుకు 86 శాతం, వెంకట నరసింహకు 84శాతం, అప్పలనాయుడికి 81శాతం.. యువగళం తీర్మానంపై రవినాయుడికి 86ు, వేణుగోపాల్‌, కేశవ్‌కు చెరో 85ు, దుర్గాప్రసాద్‌కు 84ు, రాధాకృష్ణ, శివకుమార్‌కు చెరో 83ు, ఖాదర్‌బాషాకు 72ు వచ్చినట్లు తెలిపారు. ఇంతకుముందు మాదిరి తాను రాత్రి 10 గంటల వరకు మీటింగ్‌లు పెట్టడం లేదని, టైం అంటే టైమేనని చెప్పారు.

- (మహానాడు ప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి)


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 05:36 AM