ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Annadata Sukhibhava Program: పొలాల్లో.. మంచాలపై కూర్చొని

ABN, Publish Date - Aug 03 , 2025 | 03:58 AM

సాధారణంగా ముఖ్యమంత్రి సభలం టే.. వీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేక వేదిక, సభికుల కోసం ప్రాంగణమం తా టెంట్లు, కుర్చీలు, బారికేడ్లతో ఏర్పాట్లు చేస్తారు. సీఎం చంద్రబాబు పాల్గొన్న అన్నదాత సుఖీభవ ప్రారంభ కార్యక్రమం ఇందుకు భిన్నంగా సాగింది.

  • రైతులతో చంద్రబాబు ముఖాముఖి

  • వినూత్నంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం

  • సూపర్‌-6లో మరో హామీ అమలు.. 2 గంటలు ఎండలోనే సీఎం

  • అక్కడి నుంచే స్క్రీన్‌ ద్వారా ప్రధాని వారాణసీ సభను తిలకించిన సీఎం

ఒంగోలు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): సాధారణంగా ముఖ్యమంత్రి సభలం టే.. వీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేక వేదిక, సభికుల కోసం ప్రాంగణమం తా టెంట్లు, కుర్చీలు, బారికేడ్లతో ఏర్పాట్లు చేస్తారు. సీఎం చంద్రబాబు పాల్గొన్న అన్నదాత సుఖీభవ ప్రారంభ కార్యక్రమం ఇందుకు భిన్నంగా సాగింది. ఒకవైపు పచ్చగా ఎదిగిన సజ్జ పంట.. మరోవైపు వరి సాగుకు వీలుగా నీరు పెట్టి దమ్ము చేసిన మాగాణి భూమి మధ్య పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో నులక, నవ్వారు మంచాలపై రైతులు కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. రైతులకు అభిముఖంగా వేసిన మంచాలపైనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చున్నారు. పైన టెంట్లు లేకుండా ఆరు బయట ఆకుపచ్చ కండువాలు వేసుకుని అందరూ ఆశీనులయ్యారు. శనివారం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తూర్పువీరాయపాలెం గ్రామం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు సాగు ఖర్చు కోసం కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. రైతులతో ముఖాముఖి పేరుతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఉదయం 11.30కు ప్రాంగణానికి చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్‌ ద్వారా వారాణసీలో ప్రధానమంత్రి న రేంద్రమోదీ పాల్గొన్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధుల విడుదల కార్యక్రమాన్ని అందరితో కలిసి తిలకించారు. దాదాపు 50 నిమిషాల పాటు మోదీ ప్రసంగాన్ని విన్నారు. అనంతరం మహిళా రైతులతో మాట్లాడారు.

ఎండ వేడిమి ఎక్కువగా ఉండటంతో చెమట తుడుచుకుంటూ అటు ప్రముఖులు, ఇటు రైతులు కార్యక్రమం జరిగినంత సమయం మంచాలపైనే కూర్చున్నారు. 1.30 గంటల వరకు సుమారు రెండు గంటల పాటు చంద్రబాబు సహా అందరూ ఎండలోనే గడిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలతో సమావేశం రద్దు

తొలుత సీఎంతో ముఖాముఖి కార్యక్రమానికి గ్రామానికి చెందిన రైతులను పరిమితంగానే అధికారులు అనుమతించారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి ఉదయం 10 గంటలలోపే ప్రాంగణంలోకి అనుమతించారు. సీఎం చంద్రబాబు వచ్చిన అనంతరం గ్రామస్థులు, పరిసర ప్రాంత టీడీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో ముందు వైపు ప్రాంగణమంతా రైతులు, ప్రత్యేకించి మహిళా రైతులు, టీడీపీ శ్రేణులతో కిటకిటలాడిపోయింది.

Updated Date - Aug 03 , 2025 | 04:01 AM