TDP: మహానాడు తొలిరోజు సైడ్ లైట్స్
ABN, Publish Date - May 28 , 2025 | 05:45 AM
మహానాడులో చంద్రబాబు, లోకేశ్ ప్రసంగాలు జైకారాలతోting సందర్భంగా ఆకట్టుకున్నాయి. 23 వేల ప్రతినిధులతో వేడుక శోభ పంచగా, కార్యకర్త సత్య మాదల అరచేతిలో కర్పూరంతో హారతి ఇచ్చిన దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తొలిరోజు ప్రతినిధుల సభలో సీఎం చంద్రబాబు 11.53 గంటలకు ‘జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్’ అంటూ ప్రసంగం ప్రారంభించి 12.40 గంటల వరకూ మాట్లాడారు.
చంద్రబాబు ప్రసంగించే ముందు ‘జై బాబు, జైజై బాబు’ అంటూ జనం కేరింతలు కొట్టారు. ‘చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు.
చంద్రబాబు ప్రసంగించేటప్పుడు విజయవాడకు చెందిన మహిళా కార్యకర్త సత్య మాదల అరచేతిలో కర్పూరం పెట్టుకుని గ్యాలరీలో నుంచే హారతి ఇచ్చారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ 12.45 గంటలకు ప్రసంగం ప్రారంభించి 1.06 గంటలకు ముగించారు. లోకేశ్ ప్రసంగించేటప్పుడు ‘జై లోకేశ్’ అంటూ ప్రాంగణమంతా దద్దరిల్లేలా కార్యకర్తలు కేకలు వేశారు.
మహానాడుకు 23వేల మంది ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. ప్రతినిధులకు చిరుజల్లులు స్వాగతం పలికాయి.
మహానాడులో తొలిరోజు వార్షిక నివేదికను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రవేశపెట్టారు.
మహానాడు ప్రాంగణాన్ని అరటి మట్టలతో పండుగ వాతావరణం తలపించే విధంగా ముస్తాబు చేశారు.
ఎన్‌ఆర్‌ఐ టీడీపీ, మన టీడీపీ, హెల్ప్‌ఆన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 28 , 2025 | 05:45 AM