ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP: బీసీలకు పెద్దపీట!

ABN, Publish Date - Mar 10 , 2025 | 03:01 AM

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పాటించిన ప్రధాన కొలమానాలు ఇవే!. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నడుమ సమతూకం పాటిస్తూ చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచీ బీసీలకు పెద్దపీట వేస్తోంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ ఇద్దరు బీసీ..

ఒక ఎస్సీకి అవకాశం

బీటీ నాయుడు, బీద రవిచంద్ర,

కావలి గ్రీష్మలకు టికెట్లు ఖరారు

ఉత్తరాంధ్ర, కోస్తా, సీమలకు సమతూకం

పాటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): బలహీనవర్గాలకు పెద్దపీట.. ప్రాంతాల నడుమ సమతూకం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పాటించిన ప్రధాన కొలమానాలు ఇవే!. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నడుమ సమతూకం పాటిస్తూ చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచీ బీసీలకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని బీసీలకు కేటాయించింది. ఒక స్థానాన్ని ఎస్సీ మహిళకు ఇచ్చింది. వీరిలో బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్‌, కావలి గ్రీష్మ ఉన్నారు.

ప్రస్తుతం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా పొత్తులో భాగంగా జనసేనకు 1, బీజేపీకి 1 కేటాయించగా, 3 స్థానాలు టీడీపీ తీసుకుంది.


కలిసొచ్చిన కలుపుగోలు

కావలి నియోజకవర్గానికి చెందిన బీద రవిచంద్రయాదవ్‌ టీడీపీకి తొలినుంచీ విధేయుడిగా ఉంటున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన రవిచంద్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. జిల్లాలో నాయకుల మధ్య ఎన్ని విభేదాలున్నా రవిచంద్ర విషయంలో అందరి నడుమ ఏకాభిప్రాయం ఉంటుంది. అందరినీ కలుపుకొని వెళ్లడం.. పార్టీకి ట్రబుల్‌ షూటర్‌గా పనిచేయడం బీద రవిచంద్రను ఎమ్మెల్సీ రేసులో విజయం సాధించేలా చేశాయి. 2015లో ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన రవిచంద్రకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

బలమైన గళం వినిపించేందుకు

పార్టీలో యువరక్తాన్ని తీసుకురావాలన్న ఆలోచనతోపాటు ఎస్సీ మహిళకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో శ్రీకాకుళానికి చెందిన కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. మండలిలో వైసీపీకి ఆధిక్యం ఉండటం.. వారి తరఫున గట్టిగా మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ధీటుగా ఎదుర్కోవాలంటే టీడీపీ నుంచి బలమైన గళాన్ని వినిపించే వారు ఉండాలన్న ఉద్దేశంతో ఫైర్‌ బ్రాండ్‌గా పేరుపొందిన కావలి గ్రీష్మకు అవకాశం కల్పించారు. గ్రీష్మ గత ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం టికెట్‌ ఆశించారు. గ్రీష్మ తల్లి ప్రతిభా భారతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులపై గ్రీష్మ విరుచుకుపడిన తీరు.. ఒంగోలులో నిర్వహించిన మహానాడులో వైసీపీ నాయకులను సవాల్‌ చేస్తూ తొడకొట్టిన తీరు ఆమెను పార్టీలో ఫైర్‌ బ్రాండ్‌గా నిలిపాయి. 2017లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన గ్రీష్మ రాజాం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జిగా చేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. కూటమి అధికారంలోకి రాగానే గ్రీష్మను ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా నియమించారు. తాజాగా ఆమెకు ఎమ్మెల్సీ అవకాశాన్ని ఇచ్చారు.


ఆశావహులకు బుజ్జగింపులు

ఎమ్మెల్సీ టికెట్ల కోసం ఈసారి భారీ సంఖ్యలో ఆశావహులు క్యూ కట్టారు. అయితే 3 స్థానాలే అందుబాటులో ఉండటంతో అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాలేదు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ద్వారా ఆశావహులకు చెప్పించారు. ఆదివారం సాయంత్రమే ఆయన పిఠాపురానికి చెందిన ఎస్వీఎ్‌సఎన్‌ వర్మకు ఫోన్‌ చేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలని, 2027లో తప్పకుండా అవకాశం కల్పిస్తామని పార్టీ అధినేత మాటగా చెప్పమన్నారని తెలిపారు. మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌, సీనియర్‌ నేతలు దువ్వారపు రామారావు, టీడీ జనార్దన్‌, గురజాల మాల్యాద్రి, తదితరులకు కూడా పల్లా ఫోన్‌ చేసి ఈసారికి సర్దుబాటు చేయలేకపోతున్నట్లు చంద్రబాబు మాటగాచెప్పారు. పొత్తు ధర్మంలో భాగంగా జనసేన, బీజేపీలకు 2 సీట్లు సర్దుబాటు చేసిన నేపథ్యంలో 2027 వరకు వేచి ఉంటే తప్పకుండా న్యాయం చేస్తామని వివరించారు. కాగా, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, కొమ్మాలపాటి శ్రీధర్‌ వంటి నేతలు కూడా ఎమ్మెల్సీ టికెట్‌ ఆశించారు. వారందరినీ పార్టీ పెద్దలు బుజ్జగించనున్నారు.

మాది బీసీ పక్షపాత పార్టీ: అచ్చెన్న

ఎస్సీ, బీసీలకు పదవులు ఇవ్వడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ అంటే బీసీల పక్షపాత పార్టీ అని మరోసారి రుజువైందని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. కాగా, టీడీపీలో బీసీలకు, ఎస్సీలకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందో మరోసారి రుజువైందని ఎమ్మెల్సీ అభ్యర్థి బీద రవిచంద్రయాదవ్‌ అన్నారు. విజయవాడలో ఆదివారం రాత్రి ఆయన మాట్లాడారు. టీడీపీ తొలి నుంచీ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌, ఇప్పుడు చంద్రబాబు దీనికి నిదర్శనమని తెలిపారు. పార్టీకి కొన్ని పరిమితులు ఉంటాయని, కూటమిలో ఉన్నాం కాబట్టి కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తోందన్నారు. సీనియర్లకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ తప్పకుండా న్యాయం చేస్తారని తెలిపారు.


ఎమ్మెల్సీ టికెట్‌పై బీజేపీ నేతల పట్టు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి మిత్ర పక్షం బీజేపీకి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఒక సీటు కేటాయించారు. ఆ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయడం బీజేపీకి పెద్ద పరీక్షగా మారింది. మాకంటే మాకే ఇవ్వాలంటూ నలుగురు సీనియర్‌ నాయకులు పోటీ పడుతున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌ సహా.. గత ఎన్నికల్లో ఎంపీ టికెట్‌ ఆశించి భంగపడిన తపన్‌ చౌదరి, పాకా సత్యనారాయణ ఉన్నారు. వీరంతా ఆర్‌ఎ్‌సఎ్‌సకు వీరవిధేయులు కావడంతో ఎవరికి టికెట్‌ కేటాయించాలన్న విషయంపై పార్టీ రాష్ట్ర చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం అర్ధరాత్రి వరకు భారీ కసరత్తు చేశారు. అయితే.. ఎవరికివారు పట్టుదలగా ఉండడంతో ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానానికి నివేదించారు. దీంతో నామినేషన్లకు చివరి రోజైన సోమవారం ఉదయం ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని, ఆ వెంటనే టికెట్‌ దక్కించుకున్న అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, పార్టీ వర్గాల కథనం మేరకు సోము వీర్రాజు, మాధవ్‌ ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్సీలుగా పనిచేసినందున ఈసారి తపన్‌ చౌదరి, లేదా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు పాకా సత్యనారాయణలలో ఒకరికి అవకాశం దక్కొచ్చని సమాచారం.

విధేయతకు వీరతాడు!

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గానికి(బోయ) చెందిన బెందుల తిరుపతి నాయుడు(బీటీ నాయుడు)కి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. రాయలసీమ ప్రాంతంలో బోయలు బలమైన సామాజికవర్గంగా ఉన్నారు. ఈ సామాజికవర్గంలో బీటీ నాయుడికి గట్టి పట్టుండటం కలిసి వచ్చింది. బీటీ నాయుడు 2009, 2014లో రెండు సార్లు కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా పార్టీ పట్ల విధేయతతో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల కారణంగా చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో అన్ని రోజులూ బీటీ నాయుడు ఆయనను కలిశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన బీటీ నాయుడు ఆ సమయంలో చంద్రబాబు తరఫున న్యాయపోరాటానికి సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. 2019లో ఎమ్మెల్సీగా పంపిన పార్టీ మరోసారి ఆయనకు అవకాశం కల్పించింది.


Read more :

Also Read: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?

Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 03:07 AM