Share News

MBBS student: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు

ABN , Publish Date - Mar 09 , 2025 | 06:26 PM

MBBS student: వైద్య విద్యను అభ్యసించేందుకు కాలేజీలో చేరిన ఓ విద్యార్థికి దుండగుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో భయాందోళనకు గురైన సదరు విద్యార్థి దుండగులకు నగదు చెల్లించి.. పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

MBBS student: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు

ముంబై, మార్చి 09: వైద్య విద్యార్థిని బెదిరించి.. అతడి నుంచి భారీగా నగదు వసూల్ చేసిన ముగ్గురు వ్యక్తులపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. ఓ విద్యార్థి స్థానిక డోంగ్రీలోని సర్ జెజె హాస్పిటల్‌లో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మార్చి 6వ తేదీ రాత్రి.. సర్ జెజె హాస్పిటల్ సమీపంలోని రెస్టారెంట్‌లో భోజనం చేశాడు. అనంతరం రూమ్‌కు వెళ్తున్నాడు. అంతలో ఓ వ్యక్తి అతడికి ఎదురు పడ్డాడు. తనను గుర్తు పట్టావా? అని ప్రశ్నించాడు. లేదంటూ వైద్య విద్యార్థి సమాధాన మిచ్చాడు. ఈ ప్రాంతానికి కొత్త అంటూ వైద్య విద్యార్థిని గదమాయించాడు. అవునని చెప్పాడు.

Also Read : ఈ సమయంలో చైన్ లాగితే.. రైలు ప్రయాణంలో జరిమానా విధించరు.. ఎందుకో తెలుసా?


అంతలో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తితో చేరి.. రూ. 10 వేలు నగదు ఇవ్వాలంటూ బెదిరించారు. అంత నగదు తన వద్ద లేవని సమాధానమిచ్చాడు. మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు ఫోన్ చేసి.. ఆ నగదు ఫొన్ పే ద్వారా చెల్లించాలని.. లేకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో సదరు విద్యార్థి తన తండ్రికి ఫోన్ చేసి.. నగదు పంపించాలని కోరాడు. సదరు నగదు మొత్తన్ని.. ఫోన్ పే ద్వారా పంపారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో భయాందోళనకు గురైన వైద్య విద్యార్థి వెంటనే డోంగ్రిలోని పోలీసులను ఆశ్రయించాడు. ఆ క్రమంలో పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా వైద్య విద్యార్థిని బెదిరించిన వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?

Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ


గత వారం గురుగ్రామ్‌లో..

దేశ రాజధాని న్యూఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి.. తాను దర్యాప్తు సంస్థకు చెందిన సినియర్ అధికారినంటూ ప్రజలకు పరిచయం చేసుకున్నాడు. వారి వద్ద నుంచి నగదు వసూల్ చేస్తున్నారు. దీంతో అతడిని ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. అతడు రవిరాజ్ కుమార్‌గా గుర్తించారు. అతడిపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్‌ కింద అతడిని అరెస్ట్ చేశారు.

For National News And Telugu News

Updated Date - Mar 09 , 2025 | 06:26 PM