ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా చౌడేశ్వరి దేవి జయంతి

ABN, Publish Date - Jul 24 , 2025 | 11:29 PM

చౌడేశ్వరీదేవి జయంతి వేడుకలను పట్టణంలోని చౌడేశ్వరీదేవి ఆలయాల్లో గురువారం వైభవంగా నిర్వహించారు.

మైలవరం: కలశాలతో చౌడేశ్వరిదేవి ఆలయానికి ఊరేగింపుగా వస్తున్న మహిళలు

ప్రొద్దుటూరు టౌన్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): చౌడేశ్వరీదేవి జయంతి వేడుకలను పట్టణంలోని చౌడేశ్వరీదేవి ఆలయాల్లో గురువారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జయంతిని పురష్కరించుకుని తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తుల రాకతో చౌడేశ్వరీదేవి ఆలయాల్లో కిటకిటలాడాయి. సుబ్బిరెడ్డి కొట్టాలులోని చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి సుందరంగా అలంకరించారు. వసంతపేటలోని చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. థర్మల్‌రోడ్డులోని అష్టభుజ మహాచౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. వినాయకనగర్‌లోని చౌడేశ్వరీదేవి ఆలయం, ఆర్ట్స్‌ కాలేజీ రోడ్డులోని చౌడేశ్వరీదేవి ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వినియోగం చేశారు.

ఎర్రగుంట్లలో: చౌడేశ్వరీదేవి జన్మదిన వేడుక లు మండల వ్యాప్తంగా గురువారం వైభవంగా నిర్వహించారు. స్థానిక ముద్దనూరురోడ్డులోని చౌడేశ్వరీదేవి ఆలయంలో ఉదయం నుంచి అభి షేకం, కుంకుమార్చన, అష్టోత్తరశతనామ పూజ లు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తు లు అమ్మవారికి మొక్కులు తీర్చుకుని తీర్థప్ర సాదాలను స్వీకరించారు. నిడుజువ్వి గ్రామంలో చౌడేశ్వరీదేవి అమ్మవారి ఆషాఢ మాసం అమా వాస్య సందర్భంగా సారే చీరే సమర్పించారు. చిన్నారులు వేసిన కోలాటం అందరిని ఆకట్టు కుంది. ఆర్టీపీపీలోని చౌడేశ్వ రీదేవి ఆలయంలో భక్తులు అమ్మ వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

మైలవరంలో: తొగటవీర క్షత్రియుల ఆరాధ్యదైవమైన చౌడేశ్వరీదేవి జయంతి వేడుకలను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండల పరిధిలోని దొమ్మరనంద్యాల, వేపరాల, మైలవరం గ్రామాల్లోని చౌడేశ్వరీదేవి అమ్మవారికి మహిళలు కలశాలను మోస్తూ పురవీధుల్లో భక్తి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆలయం వద్దకు చేర్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారి మూలవిరాట్‌ను శోభాయమానంగా అలంకరించారు. వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అమ్మవారి జయంతిని పురష్కరించుకుని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి వేపరాలలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ముద్దనూరులో:మండలంలోని ఉప్పలూరు, చిన్నదుద్యాల గ్రామాల్లో గురువారం చౌడేశ్వరీ దేవి ఆలయాల వద్ద అమ్మవారి పుట్టినరోజు వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. అలాగే బర్త్‌డే కేక్‌ కట్‌ చేసి భక్తులు అమ్మవారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

కొండాపురంలో: మండలంలోని టి.కోడూరు గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి జయంతి ని గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని రథంలో మేళతాళాల మధ్య గ్రామంలో పురవీధుల గుండా ఊరేగిం చారు. ఇందులో భాగంగా నిర్వహించిన జ్యోతు ల ఉత్సవం భక్తులను ఆకట్టుకుంది. ఈ సంద ర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు.

Updated Date - Jul 24 , 2025 | 11:29 PM