ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tribal Farmers: గంజాయి నుంచి రాజ్మా వైపు

ABN, Publish Date - Jul 13 , 2025 | 03:57 AM

సమాజానికి హానికరమైన గంజాయి సాగుకు స్వస్తి పలికి, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్న సీఎం చంద్రబాబు పిలుపుతో ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంత రైతుల్లో పెనుమార్పు వచ్చింది. అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో నిరుడు...

  • ఏజెన్సీలో మారుతున్న సాగు విధానం

  • సీఎం పిలుపుతో గిరిజన రైతుల్లో మార్పు

  • వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు చొరవ

  • నిరుడు 90శాతం రాయితీతో విత్తనాల పంపిణీ

  • ఎకరాకురూ.25 వేల నికర ఆదాయం

  • ఈ ఏడాదీ రాయితీ విత్తనాల సరఫరాకు ఏర్పాట్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సమాజానికి హానికరమైన గంజాయి సాగుకు స్వస్తి పలికి, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్న సీఎం చంద్రబాబు పిలుపుతో ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంత రైతుల్లో పెనుమార్పు వచ్చింది. అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో నిరుడు గిరిజన రైతులు గంజాయికి బదులు రాజ్మా పంట సాగు చేసి, ఆర్థికాభివృద్ధి సాధించారు. ఈ ఏడాదీ రాజ్మా సాగు చేయడానికి ఏజెన్సీ ప్రాంత రైతులు ఉత్సాహం చూపుతున్నారు. రాయితీ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అల్లూరి జిల్లా పాడేరు డివిజన్‌లో గంజాయి పంట విస్తారంగా సాగైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపడంతో గత ఏడాది నుంచి ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు గణనీయంగా తగ్గింది. దాని స్థానంలో రాజ్మా పంటను గిరిజనులు పండించడం ప్రారంభించారు. నిరుడు 22,500 ఎకరాల్లో రాజ్మా సాగు ద్వారా పొందిన దిగుబడి నికర ఆదాయ విలువ రూ.56.25కోట్లుగా వ్యవసాయశాఖ అంచనా వేసింది. పాడేరు డివిజన్‌లోని 11 మండలాల్లో గిరిజన రైతులకు గత ప్రభుత్వంలో కొందరు డబ్బు ఆశ చూపి గంజాయి సాగుకు ఊతమిచ్చారు. దానివల్ల ఏజెన్సీ ప్రాంత పరువుకు విఘాతం కలుగుతుండటంతో గిరిజన రైతుల ఆలోచన విధానంలో మార్పు వస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు రంగంలోకి దిగారు. శాస్త్రవేత్తలు, ఐటీడీఏ, క్షేత్రస్థాయి అధికారులతో అక్కడి నీటి వనరులు, వాతావరణ పరిస్థితులు, పంటల సాగుకు అనుకూలత అంశాలపై నివేదికలు తీసుకుని, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేస్తున్నారు.

రాజ్మా పంట సాగుకు పూర్తి అనుకూలమైన పాడేరు డివిజన్‌లో 90శాతం రాయితీపై రాజ్మా విత్తనాలను పంపిణీ చేయించారు. గతేడాది రూ.6.11కోట్ల రాయితీతో 4,500 క్వింటాళ్ల రాజ్మా విత్తనాలను 35,618 మంది రైతులకు అందించగా, 22,500 ఎకరాల్లో సాగు చేశారు. సాధారణంగా రాజ్మా ఖరీఫ్‌ చివరలో సెప్టెంబరులో వర్షాధారంగా పండించే అపరాల పంట. దీనిని కొన్ని ప్రాంతాల్లో ఫ్రెంచి చిక్కుడు అంటారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు అటవీ హక్కులున్న భూముల్లో రబీ పంటగా దీన్ని సాగు చేస్తారు. అధిక వర్షాన్ని తట్టుకోలేని ఈ పంటను నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోనే సెప్టెంబరు నుంచి సాగు చేస్తారు. డిసెంబరులో ఈ పంట కోతకకు వస్తుంది. హెక్టారుకు 9-10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రాజ్మా ఉత్పత్తికి అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది. మార్కెట్‌లో కిలో రూ.100దాకా పలుకుతోంది. గిరిజనులు దీనిని స్థానికంగా సంతల్లో అమ్ముతున్నారు. పంట ఉత్పత్తిలో 60శాతం ఉత్తర భారతదేశానికి ఎగుమతి అవుతోంది. విత్తన రాయితీ, మంచి ధర రావడం వల్ల ఎకరానికి రూ.25వేల నికర ఆదాయం వచ్చిందని అక్కడి రైతులు చెప్తున్నారు. ఈ ఏడాది ఖరీ్‌ఫలో కూడా 4,900 క్వింటాళ్ల రాజ్మా విత్తనాలను 90ు రాయితీపై పాడేరు ప్రాంత గిరిజన రైతులకు వచ్చే నెల మొదటి వారంలోగా సరఫరా చేయనున్నట్లు డిల్లీరావు తెలిపారు. గంజాయి అనర్థాలపై గిరిజన రైతులకు అవగాహన కల్పించి, రాజ్మా సాగును ప్రోత్సహించిన అల్లూరి జిల్లా వ్యవసాయశాఖ సిబ్బందిని ఆయన అభినందించారు.

Updated Date - Jul 13 , 2025 | 04:02 AM