ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలపై చర్చ సాగేనా?

ABN, Publish Date - Apr 26 , 2025 | 12:54 AM

కర్నూలు నగరపాలక సంస్థలోని సమస్యలపై చర్చ జరిగేనా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవు తున్నాయి.

ఫ నేడు సర్వసభ్య సమావేశం

ఫ కార్పొరేషనలో అభివృద్ధే అంతంతే.

ఫ బురదమయంగా నగర రోడ్లు

ఫ ప్రజల్లో నెలకొన్న ట్రా‘ఫికర్‌’

ఫ ఊసే లేని రోడ్ల విస్తరణ ఫ దుర్భర స్థితిలో డ్రైన్లు

ఫ తాగునీటికి తప్పని అవస్థలు

ఫ హాజరుకానున్న మంత్రి టీజీ భరత,

ఎంపీలు బస్తిపాటి, బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు

కర్నూలు, న్యూసిటీ, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరపాలక సంస్థలోని సమస్యలపై చర్చ జరిగేనా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవు తున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిరోజు ఏదో ఒకసమస్య వస్తూనే ఉంది. నగరాన్ని సుంద రవనంగా తీర్చిదిద్దాతామని వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదిశగా అభివృద్ధి చేయలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్ర స్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలవుతు న్నా అభివృద్ధి పనులు అంతంత మాత్రమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. వర్షం పడి తే శివారుకాలనీల్లో రోడ్లన్నీ బురదమయంగా మా రుతున్నాయి. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్‌ నియంత్రణకు చ ర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ప డుతున్నారు. రోడ్ల విస్తరణ చేపడితే ట్రాఫిక్‌ అంత రాయం నుంచి విముక్తి కలుగుతుంది. నగరంలో వాహనాలకు పార్కింగ్‌ సమస్య వేధిస్తోంది. బహు ళఅంతస్తు భవనాలు, వ్యాపార సముదాయాల వద్ద పార్కింగ్‌ లేకపోవడంతో వాహనాలను పార్కింగ్‌ కరువైంది. నిషేధిత ప్లాస్టిక్‌పై నియంత్రణ కొరవ డింది. యథేచ్ఛగా విక్రయాలు, విచ్చలవిడిగా విని యోగం సాగుతోంది. నగర పరిధిలో కోట్లు వెచ్చించి డ్రైనేజీలు, సీసీరోడ్లు, వివిధ అభివృద్ధ్ది పనులు చేప ట్టేందుకు ఎన్నికల ముందు అనేకచోట్ల ప్రజాప్రతిని ధులు, అధికారులు శంకుస్థాపన చేశారు. అందులో కొన్ని శంకుస్థాపన వరకే పరిమితమయ్యాయి. వీట న్నింటిపై అధికార ,ప్రతిపక్ష కార్పొరేటర్లు ప్రశ్నిస్తారా లేదా అనే విషయంపై కొందరు గుసగుసలాడుతు న్నారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్పొరే టర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటుప డిందని కొందరు వైసీపీ కార్పొరేటర్లే పలు సమావే శాల్లో మేయర్‌పై ప్రశ్నలవర్షం కురిపించారు. ప్రస్తు తం మేయర్‌ను కూడా దించేందుకు ప్రతిపక్ష కార్పొరేటర్లు ప్రయత్నిస్తు న్నట్లు తెలుస్తోంది.

శివారు కాలనీలపై శీతకన్ను..

శివారు కాలనీలపై వైసీపీ హయాం లో ప్రజాప్రతినిధులు, అధికారులు శీత కన్ను వేశారు. కల్లూరు మండలంలోని పందిపాడు, లక్ష్మీపురం రోడ్డు అధ్వా నంగా తయారైంది. ఇతర కాలనీల పరి స్థితి అదేవిధంగా ఉంది. వర్షాకాలంలో చి న్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ బురదమ యంగా మారుతున్నాయి. సంస్థ పరిధిలో సు మారు 850 కిలోమీటర్ల రోడ్లవిస్తరణ ఉంది. సుమారు 50నుంచి 60రహదారులు గుంతలమయంగా తయార య్యా యి. తాగునీటికోసం ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు. కొన్నిచోట్ల రెండు,మూడు రోజులకోసారి నీరు వదులుతున్నారు. నగరంలో 52 వార్డుల్లో సుమారు 6లక్షలకుపైగా జనాభా నివసిస్తున్నారు. కర్నూలు, పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూ రుని కలుపుకొని మొత్తం 33 ఓవర్‌హెడ్‌ ట్యాంకు లున్నాయి. ప్రతిరోజు 80 ఎంఎల్‌డీ(మిలియన లీటర్‌ పర్‌డే) మేర నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత జనాబాను దృష్టిలో ఉంచుకుని దాదాపు 120 ఎంఎల్‌డీల నీటి అవసరముంది.

పలు అంశాలపై చర్చ..

నగరపాలకసంస్థ సర్వసభ్యసమావేశం శనివారం ఉదయం 11గంటలకు జరగనుంది. పలు అంశా లపై పాలకవర్గ సభ్యులు చర్చించనున్నారు. సుం కేసుల రోడ్డులోని ఎస్‌బీఐ కాలనీ కౌన్సిల్‌హాల్‌లో జరిగే సమావేశానికి మేయర్‌ బీవై.రామయ్య అధ్య క్షతన వహించనున్నారు. మంత్రి టీజీ.భరతతో పాటు కర్నూలు, నంద్యాల ఎంపీలు బస్తిపాటి నాగ రాజు, బైరెడ్డి శబరి, పాణ్యం, కోడుమూరు ఎమ్మె ల్యేలు గౌరుచరితారెడ్డి, దస్తగిరి, కమిషనర్‌ ఎస్‌. రవీంద్రబాబు తదితరులు హాజరుకానున్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:54 AM