AP BJP State President: అమిత్ షాతో మాధవ్ భేటీ
ABN, Publish Date - Jul 23 , 2025 | 05:38 AM
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ భేటీ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మంగళవారం షాను పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు వివరించిన ఆయన పార్టీ బలోపేతానికి గురించి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతోనూ మాధవ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి శ్రీనివా్‌సవర్మ, మాధవ్ చెప్పారు.
Updated Date - Jul 23 , 2025 | 05:40 AM