BJP New President: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ బాధ్యతల స్వీకరణ రేపు
ABN, Publish Date - Jul 08 , 2025 | 05:40 AM
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇటీవలే అధ్యక్షుడిగా ఎన్నికైన మాఽ దవ్.. ఎన్నిక నిర్వాహకుడు పాకా సత్యనారాయణ నుంచి ధ్రువీకరణ పత్రం, పురందేశ్వరి నుంచి జెం డా అందుకొని అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. అయితే అధికారికంగా ఈ నెల 19 లోపు(జాతీయ అధ్యక్షుడి ఎంపిక) బాధ్యతలు తీసుకోవాల్సి ఉం ది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీతోపాటు మోర్చాల అధ్యక్షుల్ని నియమిస్తారు.
Updated Date - Jul 08 , 2025 | 05:41 AM