Bhuvaneshwari : ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్
ABN, Publish Date - Jan 26 , 2025 | 04:31 AM
ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని నారా భువనేశ్వరి అన్నారు.
బెంగళూరు టీడీపీ ఫోరం సంక్రాంతి వేడుకల్లో భువనేశ్వరి
బెంగళూరు, అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని నారా భువనేశ్వరి అన్నారు. బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో కేఆర్ పుర అంబేడ్కర్ మైదానంలో శనివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, అమిలినేని సురేంద్రబాబు, ఎమ్మెల్సీ శ్రీకాంత్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ‘ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకు వస్తున్నాయి. దీనికి కారణం చంద్రబాబుకు ఉన్న గుర్తింపే. బెంగళూరులోని పార్టీ కార్యకర్తలు, ఫోరం ప్రతినిధుల సేవలను ఎప్పటికీ మరువలేం. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ‘నిజం గెలవాలి’ అనే నినాదం ఇచ్చా. అప్పట్లో ఏపీలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు నిరసన తెలిపేందుకు భయపడే పరిస్థితి ఉండేది. కానీ బెంగళూరులో రోజూ వందలాదిమంది రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఆ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించి, తెలంగాణకు పాకి దేశమంతటా నిరసన తెలిపేలా చేసింది. అన్నీ కలిసొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో సంతృప్తికరమైన ప్రభుత్వం ఏర్పడింది. మన సంప్రదాయంలో ప్రతి పండుగకు ఓ చరిత్ర ఉంది, సంక్రాంతికి ప్రత్యేకత ఉంది. ఉద్యోగాలకోసం బెంగళూరులో స్థిరపడినా, సంప్రదాయంగా పండుగను జరపడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు
విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే
వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే
కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Jan 26 , 2025 | 04:31 AM