ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Revenue Department: భూమన భూదందా నిజమే

ABN, Publish Date - Jul 25 , 2025 | 03:43 AM

రాజకీయ విలువల గురించి ఉపన్యాసాలు ఇచ్చే తిరుపతి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి గుట్టురట్టయింది. తిరుపతి సమీపంలోని తిరుచానూరులో ఆయన 50 కోట్లపైన విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాచేశారని రెవెన్యూశాఖ నిగ్గు తేల్చింది.

  • స్వర్ణముఖి నది పక్కనే 9 ఎకరాలు కబ్జా

  • ప్రహరీ కట్టి కలిపేసుకున్న వైసీపీ నేత

  • నిర్ధారించిన రెవెన్యూ శాఖ

  • ఆ భూమి విలువ రూ.50 కోట్ల పైమాటే

  • భూ కబ్జాపై భూమన కు రెవెన్యూ నోటీసు

  • చట్ట ప్రకారం కేసులు: మంత్రి అనగాని

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాజకీయ విలువల గురించి ఉపన్యాసాలు ఇచ్చే తిరుపతి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి గుట్టురట్టయింది. తిరుపతి సమీపంలోని తిరుచానూరులో ఆయన 50 కోట్లపైన విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాచేశారని రెవెన్యూశాఖ నిగ్గు తేల్చింది. ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉండగానే తిరుచానూరులో స్వర్ణముఖి నదీపరివాహకంలోని 9 ఎకరాల ప్రభుత్వ భూమిని తన భూమిలో కలిపేసుకొని.. చుట్టూ ప్రహరీగోడ కట్టేసుకున్నారు. ఆనాడు ఆయన వైసీపీ ప్రభుత్వంలో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తి. దీంతో రెవెన్యూ యంత్రాంగం నోరు మెదపలేదు. నాటి ఇనాం, రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే భూ కబ్జాకు జీ హుజూర్‌ అన్నారు. అయితే, కబ్జాచేసిన భూమిపై ప్రైవేటు పట్టా ఇవ్వనన్నందుకు ఓ పెద్ద యుద్ధమే చేశారు. ఓ ఉన్నతాధికారి వద్దకు రాయబేరాలు పంపినా ఫలితం లేకపోవడంతో వ్యక్తిగత వైరం కింద ఆయన పోస్టింగ్‌ను మార్పించేశారు. అయినా భూమి కబ్జా ఇప్పుడు బట్టబయలైంది. తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చొరవతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విచారణలో వాస్తవాలన్నీ బయటకొస్తున్నాయి. ఈ నేపధ్యంలో భూ కబ్జా నిరోధక చట్టం కింద భూమనకు రెవెన్యూశాఖ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.చట్టపరంగా ఆయన పై కేసులు పెట్టేందుకూ సన్నద్ధమవుతోంది.

ప్రహరీ కట్టి కలిపేసుకున్నారు..

తిరుచానూరులో భారీగా ఇనాం భూములున్నాయి. దాని పక్కనే సర్వేనంబర్‌ 479లో స్వర్ణముఖి నదీ పరివాహక భూములు ఉన్నాయి. నిజానికి సర్వే నంబర్లు 472, 473, 474లో భూమన భార్య జె. రేవతి, ఆయన కుమారుడు అభినయ్‌ పేరిట 15.36 ఎకరాలుంది. ఇందులోనే మరో 9 ఎకరాల ఇనాం, స్వర్ణముఖి నదీ పరివాహకం ఉన్నట్లు తొలుత విజిలెన్స్‌ గుర్తించింది. రెవెన్యూశాఖ ఈ భూమిని క్షేత్రస్థాయిలో సర్వేచేసి పరిశీలించినప్పుడు భూమన నికరంగా 9 ఎకరాల భూమిని కబ్జాచేసినట్లు గుర్తించింది. అదెలాగంటారా.... భూమన కంట్రోల్‌లో ఉన్న భూమిలో మామిడితోట ఉంది. ఇదంతా 24.36 ఎకరాల్లో ఉంది. ఇందులో రికార్డుల ప్రకారం 15.36 ఎకరాల భూమికే భూమనకు రికార్డులున్నాయి. మిగిలిన 9 ఎకరాలకు రికార్డులేదు. ఆ భూమి నిజానికి ఇనాం భూమి. ఇందులోనే కొంత స్వర్ణముఖి నదీపరివాహకం కూడా కలిపి ఉంది. ఇలా ప్రభుత్వ భూమిని తన ఖాతాలో వేసుకొని భూమన చుట్టూ ప్రహరీగోడ కట్టేశారు. నదీ పరివాహకం తన భూమిలో కలిపేసుకున్న విషయం సామాన్యులకు అర్ధంకాకుండా ఉండేందుకు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టితో ఆ ప్రాంతాన్ని నింపేశారు. అంటే, తోట భూమితో సమానంగా దీన్ని ఎత్తు పెంచారు. ఇందుకోసం లక్ష టన్నులమేర గ్రావెల్‌ వాడి ఉంటారని రెవెన్యూవర్గాలు గుర్తించాయి. ఈ మట్టి ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలో ఆరా తీయాల్సిందిగా గనులశాఖను రెవెన్యూశాఖ కోరింది.

అక్రమాన్ని సక్రమం చేయాలని ఒత్తిడి..

తన భూమిలో కలిపేసుకున్న ఇనాం భూమిపై హక్కుల కోసం భూమన వైసీపీ అధికారంలో ఉండగా తెగ ప్రయత్నం చేశారు. ఆ నాటి ఇనామ్‌ డీటీతో సానుకూల ఉత్తర్వులు పొందారు. ఇందుకు ఆనాటి తిరుపతి రెవెన్యూ అధికారి కూడా ఇతోధికంగా సహాయం చేశారు. అయితే ఉన్నతస్థాయిలో అవరోధాలు ఎదురయ్యాయి. జిల్లా స్థాయి అధికారి ఒకరు ఇనాం భూమిని వదులుకునేది లేదని తేల్చిచెప్పారు. ఇనాం డీటీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసును ఆ నాటి అప్పీల్స్‌ కమిషనర్‌ వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ దీనికి సంబంధించిన ఫైలే కనిపించకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ కీలక అధికారి సహకారంతో ఈ ఫైలుకు తిరిగి ప్రాణంపోసే ప్రయత్నం చేశారు. తను అనుకున్నదే జరిగిపోతుందనుకున్నారో ఏమో...ప్రభుత్వ ఉత్తర్వులు, ఆదేశాలు రాకముందే ఇనాం భూమితోపాటు, పక్కనే ఉన్న స్వర్ణముఖి నదీ పరివాహకాన్ని కూడా భూమన తన భూమిలో కలిపేసుకున్నారు. తనకు భూములు, ఆస్తులు, అడ్డగోలు సంపాదనలపై ఆశే లేదని పదేపదే సూక్తులు చెప్పే భూమన, విలువైన ఇనాంతోపాటు, స్వర్ణముఖి నదీపరివాహక భూమిని కబ్జాచేశారని రెవెన్యూశాఖ తేల్చింది. పక్కా ఆధారాలు, రికార్డులతో సహా భూ కబ్జాను నమోదు చేసింది. మరి ఇప్పుడు ఆయన ఇది కూడా కల్పితం, కుట్ర అంటారా? లేక కబ్జా నిజమే అంటారా? చూడాల్సిందే.

నదీ కబ్జా..

2023లో స్వర్ణముఖి నదీ భూ ముల పరాధీనం పేరిట ‘ఆంధ్రజ్యోతి’ తొలి వార్తను ప్రచురించింది. కూటమి ప్రభుత్వంలో దీనిపై విజిలెన్స్‌ విభాగం విచారణ చేపట్టింది. తిరుచానూరు సమీపంలోని భూమన తన భూముల్లో ప్రభుత్వ భూమిని కలిపేసుకున్నారని, భూ కబ్జా వార్త నిజమేనని విజిలెన్స్‌ నిర్ధారించింది. దీనిపై ఈ ఏడాది మే 7వ తేదీన స్వర్ణముఖి నదీలో విలువైన భూములు భూమన కరుణాకర్‌రెడ్డి కబ్జాచేశారంటూ ‘భూ కబ్జాల భూమన’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రముఖంగా వార్తను ప్రచురించింది. దీనిపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విజిలెన్స్‌ నివేదిక, ‘ఆంధ్రజ్యోతి’ వార్తల్లో పేర్కొన్న అంశాలపై సమగ్ర విచారణ చే పట్టాలని ప్రభుత్వం తిరుపతి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారుల బృందాలు స్వర్ణముఖి నదీపరివాహకంలోని భూములను నిశిత పరిశీలన చేసింది.

భూమనపై చట్టపరమైన చర్యలు

తిరుచానూరులోని ఇనాం, స్వర్ణముఖి నదీ పరివాహక భూమిని భూమన కరుణాకర్‌రెడ్డి కబ్జాచేశారని రెవెన్యూశాఖ నిర్ధారించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు. ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ’’భూమన కేవలం ఇనాం భూములే కాదు, ప్రైవేటు భూములు కూడా కబ్జాచేశారన్న ఫిర్యాదులున్నాయి. వాటిపై కూడా విచారణ చేయాలని అధికారులను ఆదేశించాను. తిరుచానూరులో ఇనాం భూమికబ్జా నిర్ధారణ అయింది కాబట్టి, భూ కబ్జా నిరోధక చట్టం, ఇతర రెవెన్యూ చట్టాల కింద ఆయనకు నోటీసులు ఇస్తాం. ఆపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి సత్యప్రసాద్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 03:46 AM