ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gita Audio Launch: గజల్‌ శ్రీనివాస్‌ సంగీతం గాత్రంతోసంపూర్ణ శ్రీమద్‌ భగవద్గీత ఆడియో విడుదల

ABN, Publish Date - Apr 11 , 2025 | 05:47 AM

గజల్‌ శ్రీనివాస్‌ గానం, సంగీతంతో సంపూర్ణ శ్రీమద్‌ భగవద్గీత ఆడియోను పాలకొల్లులో విడుదల చేశారు. ఈ కార్యక్రమం సేవ్‌ టెంపుల్స్‌ భారత్‌ ఆధ్వర్యంలో జరిగింది

పాలకొల్లు అర్బన్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ప్రముఖ గజల్స్‌ గాయకుడు కేశిరాజు శ్రీనివాస్‌ సంగీతం సమకూర్చి గానం చేసిన సంపూర్ణ శ్రీమద్‌ భగవద్గీత ఆడియో విడుదల కార్యక్రమం గురువారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లయన్స్‌ క్లబ్‌లో జరిగింది. ‘సేవ్‌ టెంపుల్స్‌ భారత్‌-శ్రీసూర్యనారాయణ స్వామి దేవస్థానం ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆడియోను శ్రీనివాస్‌ తండ్రి నరసింహారావు విడుదల చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ హాజరై మాట్లాడుతూ భగవద్గీతను ఎంతో మధురంగా ఆలపించి ప్రజలకు అందించిన గజల్‌ శ్రీనివాస్‌ ‘భగవద్గీతను కొనండి అనకుండా వినండి’ అని చెబుతున్నారన్నారు. గజల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తన సంకల్పం వెనుక మిత్రుల బలం ఎంతో ఉందన్నారు. మూడు గిన్నిస్‌ రికార్డులు సాధించిన గజల్‌ శ్రీనివాస్‌ పాలకొల్లు వాసి కావడం ఈ ప్రాంతానికే గర్వ కారణమని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 05:47 AM