ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బెట్టింగ్‌ రాయుళ్లు అరెస్టు

ABN, Publish Date - Jun 05 , 2025 | 11:33 PM

పట్టణంలోని బెట్టింగ్‌ అడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఇన్‌చార్జ్‌ సీఐ మన్సూరుద్దీన్‌ తెలిపారు.

మాట్లాడుతున్న ఇన్‌చార్జ్‌ సీఐ మన్సూరుద్దీన్‌

4 సెల్‌ఫోన్లు, రూ.3.40లక్షల నగదు స్వాధీనం

ఇనచార్జ్‌ సీఐ మన్సూరుద్దీన వెల్లడి

కోడుమూరు, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బెట్టింగ్‌ అడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఇన్‌చార్జ్‌ సీఐ మన్సూరుద్దీన్‌ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న ఐపీల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో శ్రీరామచంద్ర టాకీస్‌ దగ్గర నలు గురు వ్యక్తులు బెట్టింగ్‌ ఆడుతున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే ఎస్‌ఐ డి.వై స్వామి, ఏఎస్‌ఐ శంకర్‌నాయక్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ మద్దీశ్వర్‌, మహబుబ్‌బాషా, మురారి, కానిస్టేబుల్‌ జగదీష్‌, విజయ్‌కుమార్‌, భాస్కర్‌, ఓంకార్‌ మరి కొంత మంది హోంగార్డులు దాడులు చేశారు. కోడుమూరు పట్టణానికి చెందిన గుజరాతి వినోద్‌ కుమార్‌, మాదుగుండు వేణుగోపాల్‌, సోమశేఖర్‌, పాలవారి భాస్కర్‌రెడ్డి సెల్‌ఫోన్లలో బెంగుళూరు, పంజాబ్‌ మ్యాచ్‌ను వీక్షిస్తూ బెట్టింగ్‌కు పాల్పడుతుండగా అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 4 సెల్‌ఫోన్లు, రూ.3.40లక్షల నగదును స్వాధీ నం చేసుకున్నామన్నారు. పట్టుబడిన బెట్టింగ్‌ రాయుళ్లను కోర్టులో హాజరు పరుస్తున్నట్లు చెప్పారు. బెట్టింగ్‌ రాయుళ్లను పట్టుకొన్న ఎస్‌ఐ డి.వై స్వామి, సిబ్బందిని సీఐ అభినందించారు.

Updated Date - Jun 05 , 2025 | 11:33 PM