ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వరదపై అప్రమత్తంగా ఉండండి

ABN, Publish Date - Jul 31 , 2025 | 12:53 AM

ప్రకాశం బ్యారేజీలో వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గీతాంజలి శర్మ ఆదేశించారు.

- ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వరద నీరు విడుదల

- ఆయా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి

- సెలవులు రద్దు చేసుకుని విధుల్లో చేరాలి

- అధికారులకు ఇన్‌చార్జి కలెక్టర్‌ గీతాంజలి శర్మ ఆదేశం

మచిలీపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

ప్రకాశం బ్యారేజీలో వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గీతాంజలి శర్మ ఆదేశించారు. బుధవారం సాయంత్రం మచిలీపట్నంలోని తన చాంబర్‌ నుంచి అధికారులతో ఆమె వరదలపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గీతాంజలి శర్మ మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీకి మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రెండు అడుగుల మేర కొన్నిగేట్లను ఎత్తివేసి వరద నీటిని కిందకు వదిలారని చెప్పారు. ఆ నీరు పూర్తి ఒరవడితో దిగువున ఉన్న కృష్ణాజిల్లాలోకి వస్తోందన్నారు. క్షేత్రస్థాయి అధికారులందరూ వారి ప్రధాన కేంద్రాల్లో అందుబాటులో ఉండి, వరద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సిబ్బందికి ఎవరికైనా సెలవులు ఇచ్చి ఉంటే, వాటిని వెంటనే రద్దు చేసి విధులకు హాజరుకావాలని ఆదేశించారు. జలవనరులశాఖ అధికారులు కాలువల వద్ద నిఘా ఉంచి వరద నీటి స్థాయిని ఎప్పటికప్పుడు గమనించాలని చెప్పారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లో దండోరా వేయించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇందుకోసం గ్రామ రెవెన్యూ అధికారులకు, గ్రామ సచివాలయ సిబ్బందికి వెంటనే వరద సమాచార సందేశాన్ని పంపించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో వెంటనే ఒక కంట్రోల్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు వారి మండలాల్లోని గ్రామాలను సందర్శించి వరద పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. వరద ఉధృతి అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున ఈతకు వెళ్లే వారిని వెళ్లనీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, డీఎస్పీలతో సమన్వయం చేసుకుని వరద పరిస్థితులను గమనించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని వివరించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో డీఆర్‌వో కె.చంద్రశేఖరరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:53 AM