ముగిసిన ఆత్మకూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ
ABN, Publish Date - May 04 , 2025 | 11:31 PM
పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానం వేదికగా ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26నుంచి ప్రారంభమైన ఆత్మకూరు ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ టోర్నీ ఆదివారంతో ముగిసింది.
ఆత్మకూరు, మే 4(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానం వేదికగా ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26నుంచి ప్రారంభమైన ఆత్మకూరు ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ టోర్నీ ఆదివారంతో ముగిసింది. చివరి రోజు ఆత్మకూరు గ్లాడియేటర్, ఆత్మకూరు లయన్స జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచలో గ్లాడియేటర్ జట్టు విన్నర్‌గా, లయన్స జట్టు రన్నర్‌గా నిలిచింది. గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతిగా రూ.50వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30వేల నగదుతో పాటు షీల్డ్‌లను ప్రముఖ వైద్యులు ప్రసన్నలక్ష్మీ, మన్సూర్‌బాషా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యానికి దోహదపడతాయన్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లలు ఆటలపై ఆసక్తి కనబర్చాలని సూచించారు. క్రీడాకారులు గెలుపోటములను పక్కనపెట్టి క్రీడాస్ఫూర్తితో మెలగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా క్రీడలు వ్యక్తుల మధ్యతో పాటు ప్రాంతాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించేందుకు ఉపకరించాలన్నారు. కాగా క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం విద్య, ఉద్యోగ అవకాశాల్లో మూడు శాతం రిజర్వేషన్లను కల్పించిందని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ చైర్మన పస్పీల్ మున్నా, చైతన్య హైస్కూల్ కరస్పాండెంట్ తాజుద్దిన, స్టేడియం ఇనచార్జి జునైద్‌బాషా ఉన్నారు.
Updated Date - May 04 , 2025 | 11:31 PM