BC Janardhan Reddy: రాష్ట్రంలో అస్ఫాల్ట్ ఫైబర్ రహదారులు
ABN, Publish Date - Jul 04 , 2025 | 03:53 AM
రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు, పునర్ నిర్మాణం కోసం అస్ఫాల్ట్ ఫైబర్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నట్లు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. డెన్మార్క్, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో విజయవంతమైన
నేడు బనగానపల్లెలో పైలెట్ ప్రాజెక్టు: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు, పునర్ నిర్మాణం కోసం అస్ఫాల్ట్ ఫైబర్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నట్లు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. డెన్మార్క్, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో విజయవంతమైన ఈ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ‘నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం పరిధిలో ముదిగేడు-సంజామల రహదారి నిర్మాణాన్ని శుక్రవారం డానిష్ అస్ఫాల్ట్ ఫైబర్ టెక్నాలజీతో ప్రారంభిస్తున్నాం. దాని ఫలితాలను బట్టి దశల వారీగా రాష్ట్రంలో ఈ సాంకేతిక పరిజ్ఞానంతో రహదారుల నిర్మాణం, నిర్వహణ చేపడతాం’ అని తెలిపారు.
Updated Date - Jul 04 , 2025 | 03:53 AM