ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Goa Raj Bhavan Oath Ceremony: రాజురాజ్‌భవన్‌కు రాజు

ABN, Publish Date - Jul 27 , 2025 | 03:31 AM

గోవా గవర్నర్‌ గా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు ప్రమాణ స్వీకారం చేశా రు. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో...

గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతి ప్రమాణం

ఏపీ నుంచి తరలివెళ్లిన టీడీపీ నాయకులు

కేంద్ర మంత్రులు రామ్మోహన్‌, శ్రీనివాస వర్మ, అయ్యన్న, లోకేశ్‌, పల్లా, కంభంపాటి హాజరు

అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

అమరావతి/విజయనగరం, జూలై 26(ఆంధ్రజ్యోతి): గోవా గవర్నర్‌ గా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు ప్రమాణ స్వీకారం చేశా రు. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాదె ప్రమాణం చేయించారు. అశోక్‌ గజపతి రాజు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తూ, భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మ, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రులు లోకేశ్‌, గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, అశోక్‌ గజపతిరాజు సతీమణి సునీల, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు హాజరయ్యారు. లోకేశ్‌, రామ్మోహన్‌ నాయుడును ఆప్యాయంగా పలకరించిన అశోక్‌.. యువ నాయకత్వం ఏపీని నడిపిస్తోందని గోవా రాష్ట్ర అఽధికారులకు తెలిపారు. అశోక్‌ గజపతి రాజుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏ పదవి చేపట్టినా హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే అశోక్‌ గజపతిరాజు ఈ నూతన బాధ్యతలను కూడా అంకితభావంతో నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలి’ అని చంద్రబాబు ఆకాంక్షించారు. కాగా, అశోక్‌ గజపతి రాజు ప్రమాణ స్వీకారం అనంతరం గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌తో లోకేశ్‌ మాట్లాడారు. అశోక్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ‘సీఎం సార్‌.. మా పెద్దాయనను మీ చేతుల్లో పెడుతున్నాం. ఆయన మాకు తండ్రితో సమానం. జాగ్రత్తగా చూసుకోండి’ అని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు

లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

Updated Date - Jul 27 , 2025 | 03:32 AM