Arya Vysya Community : ఆర్యవైశ్యుల గౌరవాన్ని పెంచుతున్న కూటమి
ABN, Publish Date - Jan 29 , 2025 | 05:50 AM
ఆర్యవైశ్య పదం వినపడితే చాలు జగన్ చిరాకుపడిపోయేవారని, ఆర్యవైశ్య సంఘాలను వేధింపులకు గురి చేశారని ఆరోపించారు.
వైసీపీ పాలనలో వేధింపులు, చీత్కారాలు: డూండీ రాకేశ్
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులు కోల్పోయిన గౌరవాన్ని కూటమి ప్రభుత్వం పెంచుతోందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్యవైశ్య పదం వినపడితే చాలు జగన్ చిరాకుపడిపోయేవారని, ఆర్యవైశ్య సంఘాలను వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆలయాలను, ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టారని, ఆర్యవైశ్యుల వ్యాపారాలను దెబ్బతీశారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఆ కష్టాలన్నీ కడతేరాయన్నారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాకుండా, వాసవీ అమ్మవారికి సీఎం హోదాలో చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనుండటం ఆర్యవైశ్యుల గౌరవాన్ని పెంచుతుందన్నారు. పెనుగొండలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో జనవరి 31న సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jan 29 , 2025 | 05:50 AM