DGP Harish Kumar Gupta: సీఎస్ఎస్ఆర్ పోటీల్లో ఏపీఎస్డీఆర్‌ఎఫ్‌కు మూడో స్థానం
ABN, Publish Date - Jul 19 , 2025 | 06:40 AM
సదరన్ లెవెల్ జాతీయస్థాయి సీఎస్ఎస్ఆర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (సీఎస్ఎస్ఆర్) మూడో స్థానంలో నిలిచి సత్తా చాటింది.
అభినందించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): సదరన్ లెవెల్ జాతీయస్థాయి సీఎ్‌సఎ్‌సఆర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఏపీఎ్‌సడీఆర్‌ఎఫ్) మూడో స్థానంలో నిలిచి సత్తా చాటింది. న్యూఢిల్లీలో జరిగిన పోటీల్లో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా వివిధ రాష్ట్రాలతో పోటీపడి తృతీయస్థానాన్ని కైవసం చేసుకుంది. ఏప్రిల్‌లో ఘజియాబాద్‌లో జరిగిన పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయిలో అర్హత సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఈ బృందం సభ్యులు శుక్రవారం డీజీపీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా క్రీడాకారులను అభినందించారు.
Updated Date - Jul 19 , 2025 | 06:40 AM