ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

APMDC Taskforce: ఏపీఎండీసీ ప్రాజెక్టులపై టాస్క్‌ఫోర్స్‌

ABN, Publish Date - Jul 15 , 2025 | 06:44 AM

ఏపీఎండీసీ చేపట్టనున్న నూతన ప్రాజెక్టుల పర్యవేక్షణ, పరిశీలన కోసం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • లేని పోస్టు... సీనియర్‌ జేడీకి చైర్మన్‌ బాధ్యతలు

ఏపీఎండీసీ చేపట్టనున్న నూతన ప్రాజెక్టుల పర్యవేక్షణ, పరిశీలన కోసం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గనులశాఖ సీనియర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ చైౖర్మన్‌గా ఏర్పాటయిన ఈ టాస్క్‌పోర్స్‌లో గనుల శాఖ డీడీ, ఏడీ, ఏపీఎండీసీ ఉపాధ్యక్షుడు(హెచ్‌బీఎస్‌), ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సభ్యులుగా ఉంటారు. ఏపీఎండీసీ చేపట్టే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ప్లాన్‌ ఆమోదం, లీజుల మంజూరు, ఎల్‌ఓఐ, వర్క్‌ ఆర్డర్‌ జారీ తదితర పనులు వేగంగా అమలయ్యేలా చూడటం.. వంటి బాధ్యతలను టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించారు. ఇదిలా ఉంటే, గనుల శాఖలో డైరెక్టర్‌, అదనపు డైరెక్టర్‌ ఉంటారు. ప్రస్తుతానికి గనుల శాఖకు రెగ్యులర్‌ డైరెక్టర్‌ లేరు. ఆ శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమారే ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. అదనపు డైరెక్టర్‌గా సీనియర్‌ అధికారి ఉన్నారు. ఆ శాఖలో డైరెక్టర్‌ తర్వాత సీనియర్‌ పోస్టు అదే. ఇంత కీలకమైన టాస్క్‌ఫోర్స్‌లో అదనపు డైరెక్టర్‌కు బదులు సీనియర్‌ జేడీకి కీలక బాధ్యతలు అప్పగించడం చ ర్చనీయాంశంగా మారింది. గనుల శాఖలో జేడీ పోస్టు ఉంది కానీ సీనియర్‌ జేడీ పోస్టులేదు. మరి ఈ టాస్క్‌ఫోర్స్‌కు సీనియర్‌ జేడీని ఎక్కడి నుంచి తీసుకొస్తారనే చర్చ జరుగుతోంది.

Updated Date - Jul 15 , 2025 | 06:54 AM