ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Inter Exams: ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

ABN, Publish Date - Feb 21 , 2025 | 06:18 PM

AP Inter Exams: మరికొద్ది రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వీటిని వాట్సప్‌లో డౌన్ లోడ్ చేసుకో వచ్చు. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అమరావతి, ఫిబ్రవరి 21: ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షల ప్రారంభం కానున్నాయి. ఆ క్రమంలో హాల్‌ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. మార్చి 1, 3వ తేదీల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇంటర్మీడియట్‌ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్‌ గవర్నెన్స్‌లో అందించేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. ఇక ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్ వెబ్‌సైట్‌ నుంచి సైతం వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కార్యదర్శి తెలిపారు.

ఇటీవల ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధంచిన హాల్‌ టికెట్లను సైతం వాట్సప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయం కల్పించింది ప్రభుత్వం. ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు.. పరీక్షకు హాజరుకానున్నారు. అయితే ఫీజులు చెల్లించ లేదంటూ విద్యార్థులకు ప్రైవేటు కాలేజీలు హాల్‌ టికెట్లు జారీ చేయకుండా.. ఆపేయడం వంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అందులోభాగంగా వాట్సప్‌లోనే హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకునే విధంగా నిర్ణయం తీసుకుంది. వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా ఇంటర్ హాల్‌టికెట్లను సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరోవైపు 10వ తరగతి విద్యార్థులు సైతం వాట్సప్​లోనే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.

Also Read: చెల్లి లొల్లితో అన్న పార్టీలో గగ్గోలు..


ఇంటర్మీడియట్ పరీక్షలు ఫస్ట్ ఇయర్ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఇవి మార్చి 19వ తేదీతో ముగియనున్నాయి. అలాగే ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.

Also Read: ప్రారంభమైన యమునా నదిలో కాలుష్య ప్రక్షాళన


హాల్‌టికెట్‌ను ఇలా డౌన్​లోడ్ చేసుకోవాలి..:

  • ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్‌కి.. మీ ఫోన్‌లో హాయ్ (Hi) అనే వాట్సప్‌లో మెసేజ్ చేయాలి.

  • సేవను ఎంచుకోండి అంటూ ఓ లింక్ వస్తుంది.

  • ఆ లింక్​పై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి.

  • అందులో విద్య సేవలు అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

  • అనంతరం ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ లేదా సెకండ్‌ ఇయర్‌ హాల్‌ టికెట్..​ డౌన్​లోడ్ చేసుకోండంటూ ఆప్షన్ ఉంటుంది.

  • మీరు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్ అయితే పదో తరగతి హాల్‌టికెట్‌ నెంబర్ లేదా ఆధార్‌ నెంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

  • మీరు ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ స్టూడెంట్ అయితే ఫస్ట్‌ ఇయర్‌ హాల్‌టికెట్‌ నెంబర్‌ లేదా ఆధార్‌ నెంబర్‌, పుట్టిన తేదీ ఎంటర్‌ చేయాలి.

  • కొద్ది నిమిషాల్లోనే మీ హాల్‌టికెట్‌ వాట్సప్‌కే వస్తుంది.

  • దానిని డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

    మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

    Also Read: తొక్కిసలాటలో 121 మంది మృతి.. బోలే బాబాకు క్లీన్ చీట్

    For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 21 , 2025 | 06:18 PM