Share News

YS Jagan: చెల్లి లొల్లితో అన్న పార్టీలో గగ్గోలు..

ABN , Publish Date - Feb 21 , 2025 | 05:44 PM

YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలిపై కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆయనకు ఇంటిపోరు అధికమైందని అంటుంది. అధికర పార్టీ ఇచ్చే కౌంటర్‌కు తమ పార్టీలో ఎన్‌కౌంటర్ ఇచ్చే వారే కరువయ్యారని చెబుతోంది.

YS Jagan: చెల్లి లొల్లితో అన్న పార్టీలో గగ్గోలు..

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అధికార పార్టీ నుంచి వస్తున్న పోరు కన్నా.. ఇంటి నుంచి వచ్చే పోరు అధికంగా ఉందనే చర్చ అయితే ఆ పార్టీ కేడర్‌లో నడుస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని.. లేకుంటే రానని ఇప్పటికే వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దీంతో ఆయన అసెంబ్లీకి డుమ్మా కొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ క్రమంలో సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కాస్తా ఘాటుగా చురకలంటిస్తున్నారు. ఆమె ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. అందులో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంపై చేసే విమర్శల కంటే.. సోదరుడు వైఎస్ జగన్‌ లక్ష్యంగా చేసేవే అధికంగా ఉంటున్నాయని ఈ సందర్భంగా వైసీపీ కేడర్ గుర్తు చేస్తోంది.

అలాగే.. వైఎస్ జగన్‌పై అధికార పార్టీ నేతలు చేసే విమర్శల కంటే జగనన్న వదిలిన బాణం సంధించే ప్రశ్నలు తిరిగి మన పార్టీ అధినేతకే తగులుతున్నాయంటూ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ క్రమంలో అసెంబ్లీకి వెళ్లని వైఎస్ జగన్‌ను ప్రధాని మోదీ గారి దత్తపుత్రుడు అంటూ చురకలంటిస్తుందని గుర్తు చేస్తున్నారు. వైఎస్ షర్మిల ఇలా నేరుగా ఆరోపణలు గుప్పిస్తున్నా.. వైఎస్ జగన్ మాత్రం స్పందించడం లేదని.. పోని మిగిలిన వారు అయినా స్పందించ వచ్చు కదా అని పేర్కొంటున్నారు.

కౌంటర్‌కు ఎన్‌కౌంటర్ ఇస్తేనే.. మనం ప్రజల్లో ఉంటామని కేడర్ స్పష్టం చేస్తోంది. అదీకాక పార్టీలో మీసాలు తిప్పిన, తొడలు కొట్టిన, నడి రోడ్డుపై ఆనంద తాండవం చేసిన మాజీ మంత్రలు, మాజీ ఎమ్మెల్యేలు జగన్ చుట్టు ఉన్నారని వారు సైతం ఎందుకు నోరు మెదపడం లేదని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు పులివెందుల నుంచి గెలిచిన వైఎస్ జగన్.. తాడేపల్లిలోని ప్యాలెస్‌లో ఉండకుండా.. తాడేపల్లి టు బెంగళూరు, బెంగళూరు టు తాడేపల్లి ప్యాలెస్ అన్నట్లుగా షటిల్ సర్వీస్ చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏ కష్టం వచ్చినా.. బెంగళూరు వెళ్లాలంటే చాలా కష్టమని వారు పేర్కొంటున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన.. మళ్లీ ఆ వైపు కన్నెత్తి చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ప్రారంభమైన యమునా నదిలో కాలుష్య ప్రక్షాళన


ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైల్లో పరామర్శించేందుకు పార్టీ అధినేత జగన్.. ఏకంగా బెంగళూరు నుంచి విజయవాడ వచ్చారని గుర్తు చేస్తున్నారు. అలాగే మిర్చి యార్డ్‌లో రైతులను ఆయన పరామర్శించడం.. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిన ఆయన.. అనంతరం తాడేపల్లి చేరుకొన్నారు. అక్కడి నుంచి మళ్లీ ఆయన బెంగళూరు వెళ్లిపోయాని అంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి.. అసెంబ్లీకి వెళ్లపోతే సరే సరి. కానీ అసెంబ్లీకి కూతవేటు దూరంలోని తాడేపల్లి ప్యాలెస్‌లోనైనా అయినా ఉంటే.. తమకు ఆయన అందుబాటులో ఉన్నారనే కొండంత ధైర్యం తమకు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: తొక్కిసలాటలో 121 మంది మృతి.. బోలే బాబాకు క్లీన్ చీట్


2019 ఎన్నికలకు ముందు.. పార్టీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు ఒక విధంగా ఉంటే.. ప్రస్తుత పరిస్థితలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని వారు సోదాహరణగా వివరిస్తున్నారు. గతంలో ఏదైనా సమస్య వచ్చిందంటే.. 2019 ఎన్నికలకు ముందు లోటస్ పాండ్‌లో విజయసాయిరెడ్డి ఉంటే వారని... ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లిలో సజ్జల రామకృష్ణా రెడ్డి అందుబాటులో ఉండేవారిన గుర్తు చేస్తున్నారు.


కానీ నేడు విజయసాయిరెడ్డి పార్టీ వీడితే.. సజ్జల మాత్రం ఎక్కడున్నారో కూడా తమకు తెలియదని అంటున్నారు. అలాంటి వేళ.. వైఎస్ షర్మిల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకున్నా.. తమకు మాత్రం మీరు అందుబాటులో ఉండాలంటూ వైఎస్ జగన్‌కు పార్టీ కేడర్ స్పష్టం చేస్తున్నారు. ఆ క్రమంలో బెంగళూరు కాకుండా తాడేపల్లిలోనే ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు.

For AndhraPradesh News and Telugu News

Updated Date - Feb 21 , 2025 | 05:44 PM